అత్యాచారం కేసులో బిషప్‌ను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
Kerala nun gets major blow, court acquits rapist bishop. నన్‌పై అత్యాచారం కేసులో బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను కేరళ ప్రత్యేక కోర్టు శుక్రవారం
By Medi Samrat Published on 14 Jan 2022 4:45 PM IST
నన్‌పై అత్యాచారం కేసులో బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను కేరళ ప్రత్యేక కోర్టు శుక్రవారం నిర్దోషిగా ప్రకటించింది. మలక్కల్ 2014 నుండి 2016 మధ్య అనేక సార్లు నన్ పై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఫ్రాంకో ములక్కల్ భారతదేశంలో నన్ పై అత్యాచారం చేసినందుకు అరెస్టయిన మొదటి క్యాథలిక్ బిషప్. కొట్టాయం కోర్టు ఆయనను అన్ని అభియోగాల నుంచి విముక్తి చేసింది. మలక్కల్ జలంధర్ బిషప్‌గా ఉన్న సమయంలో తన కాన్వెంట్‌ను సందర్శించిన సమయంలో నన్ పై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి. సెప్టెంబర్ 2018లో అరెస్టయిన బిషప్‌పై వచ్చిన ఆరోపణలన్నింటిని విచారించడానికి ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పడింది. బిషప్ నన్ పై అత్యాచారం చేయడం, అసహజ శృంగారం మరియు క్రిమినల్ బెదిరింపులకు పాల్పడినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో కోర్టు విచారణ నవంబర్ 2019లో ప్రారంభమైంది. ఈ కేసు దర్యాప్తుకు నాయకత్వం వహిస్తున్న కొట్టాయం పోలీసు సూపరింటెండెంట్ హరిశంకర్ మాట్లాడుతూ, 'నిందితుడికి శిక్ష పడుతుందని మేము ఊహించాము. విచారణపై సమావేశం కావాలని మేము ఇప్పటికే నిర్ణయించుకున్నాము. ప్రాసిక్యూషన్, తాము అప్పీలు చేస్తాం.' అని తెలిపారు.
ఈ కేసు విచారణ సందర్భంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా తన అనుమతి లేకుండా కేసుకు సంబంధించి ఎలాంటి విషయాలను ప్రచురించకూడదని కోర్టు నిషేధం విధించింది. ఈ కేసులో కోర్టు తీర్పు వెలువడిన వెంటనే బిషప్ కోర్టు నుంచి బయటకు వెళ్లిపోయారు. మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన స్పందించలేదు. చేతులు జోడించి దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసులో మూడేళ్ల క్రితం చార్జిషీటు దాఖలైంది. ఇందులో 83 మంది సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయి. అలాగే ల్యాప్‌టాప్ ఫోన్‌లతో సహా ఎన్నో ఆధారాలు సేకరించారు. 2014లో హిమాచల్ ప్రదేశ్‌లోని గెస్ట్ హౌస్‌లో నన్‌పై బిషప్ అత్యాచారం చేశాడని.. ఆ తర్వాత రెండేళ్లలో సన్యాసినిపై 14 సార్లు అత్యాచారం జరిగిందని కేరళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అయితే, ఇప్పుడు ఈ ఆరోపణలన్నింటి నుంచి బిషప్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.