తమిళనాడు లోనూ బీజేపీ దూకుడు.. కమల్ కు షాక్ ఇచ్చే..!

Kamal Haasan suffers setback in Tamil Nadu as senior party leader jumps ship to BJP. దక్షిణాదిన భారతీయ జనతా పార్టీ

By Medi Samrat  Published on  25 Dec 2020 11:47 AM GMT
తమిళనాడు లోనూ బీజేపీ దూకుడు.. కమల్ కు షాక్ ఇచ్చే..!

దక్షిణాదిన భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్లాలని ఎన్నో ఏళ్లుగా కలలు కంటూనే ఉంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే హవా మొదలైంది. ఇక మిగిలిన రాష్ట్రాల్లో కూడా బీజేపీ దూకుడుగా ముందుకు వెళ్లాలని అనుకుంటూ ఉంది. తమిళనాడులో అయితే ఏకంగా కమల్ హాసన్ కు షాక్ ఇచ్చింది బీజేపీ. ఇటీవలే కమల్ పార్టీ పరంగా బాగా దూకుడును పెంచారు. ఇంతలోనే కీలక నేతను బీజేపీ తన ఖాతా లోకి వేసేసుకుంది.కమలహాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ కు బీజేపీ షాక్ ఇచ్చింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత అరుణాచలం భారతీయ జనతా పార్టీలో చేరారు. అరుణాచలం మక్కల్ నీది మయ్యమ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. చెన్నైలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. అరుణాచలం బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. కమల్ హాసన్ ప్రచారాన్ని ఉద్ధృతం చేసిన తరుణంలో ఆయన పార్టీ మారడం ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో ప్రాంతీయ పార్టీలదే హవా అన్నది అందరికీ తెలిసిన విషయమే.. కానీ ఈ మధ్యనే బీజేపీ బాగా దూకుడు పెంచుతోంది. పలువురు నాయకులను పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటూ ఉంది. వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగానే బీజేపీ బలోపేతం అవ్వాలని అనుకుంటూ ఉంది. బీజేపీ కలలు సాకారమయ్యేనో లేదో..!


Next Story
Share it