సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం
Justice NV Ramana takes oath as 48th Chief Justice of India. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.
By Medi Samrat Published on
24 April 2021 6:52 AM GMT

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుత సీజేఐ ఎస్.ఎ. బొబ్డే పదవీకాలం నిన్నటితో ముగిసింది. దీంతో ఎన్వీ జస్టిస్ రమణ నూతన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
2022 ఆగస్టు 26 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించిన రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ రమణ చరిత్ర సృష్టించారు. జస్టిస్ రమణ.. 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అంతకు ముందు ఆయన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సేవలు అందించారు. కృష్ణాజిల్లా పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27న జన్మించిన ఆయన.. అంచెలంచెలుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానం వరకూ ఎదిగారు.
Next Story