బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం పొడిగింపు

JP Nadda to be BJP president till June 2024. భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ అధ్యక్షుడిగా జెపి నడ్డా పదవీకాలాన్ని జూన్ 2024 వరకు పొడిగించినట్

By Medi Samrat  Published on  17 Jan 2023 5:02 PM IST
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం పొడిగింపు

భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ అధ్యక్షుడిగా జెపి నడ్డా పదవీకాలాన్ని జూన్ 2024 వరకు పొడిగించినట్లు మంగళవారం జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం జూన్ 2024 వరకు పొడిగించబడింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జేపీ నడ్డా ప‌ద‌వీ పొడిగింపు ప్రతిపాదనను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను జాతీయ కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా అంగీకరించారు. JP నడ్డా జూన్ 2019 లో పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టారు.




Next Story