బ్రేకింగ్‌ : నడ్డా కాన్వాయ్‌పై దాడి..

JP Nadda convoy attacked in West Bengal. పశ్చిమ బెంగాల్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం పర్యటిస్తున్న బీజేపీ జాతీయ

By Medi Samrat  Published on  10 Dec 2020 2:52 PM IST
బ్రేకింగ్‌ : నడ్డా కాన్వాయ్‌పై దాడి..

పశ్చిమ బెంగాల్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం పర్యటిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చేదు అనుభవం ఎదురయ్యింది. తృణ‌మూల్ కాంగ్రెస్‌ కార్యకర్తలు నడ్డా కాన్వాయ్‌పై దాడి చేశారు. వివరాళ్లోకెళితే.. నడ్డా, కైలాష్ విజయవర్గియా గురువారం డైమండ్‌ హర్బర్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు.

ఈ సమయంలో టీఎంసీ కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా నిల్చుని బీజేపీకి వ్యతిరేక నినాదాలు చేశారు. అంతేకాక రోడ్డు బ్లాక్‌ చేయడానికి ప్రయత్నించారు. అంతటితో ఊరుకోక నడ్డా ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. దీంతో అక్క‌డ‌ ఘర్షణ వాతావరణం తలెత్తడంతో పోలీసులు రంగంలోకి దిగి.. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు.

అక్క‌డినుండి నడ్డా వాహనాన్ని పంపించేందుకు పోలీసులు ప్ర‌య‌త్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కైలాష్‌ విజయవర్గియా ట్వీట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట‌ వైరలవుతోంది.




Next Story