కొవిడ్ కేసుల పెరుగుతున్న నేపథ్యంలో జమ్ముకశ్మీర్ లో ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది అక్కడి పరిపాలనా విభాగం. ఈ మేరకు బుధవారం రాత్రి 9 గంటల నుండి ఆంక్షలు మొదలయ్యాయి. రాత్రి 9 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు మొత్తం కేంద్రపాలిత ప్రాంతంలో అనవసరమైన కదలికలపై పూర్తి ఆంక్షలు విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు మొత్తం కేంద్ర పాలిత ప్రాంతంలో రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు అనవసర రాకపోకలపై పూర్తి పరిమితి ఉంటుందని అధికారిక ప్రకటనలో పేర్కొంది.
ఇదిలావుంటే.. జమ్ముకాశ్మీర్ లో గత 24 గంటల్లో 418 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో 311 జమ్మూ డివిజన్ నుండి నమోదవగా.. 107 కాశ్మీర్ డివిజన్ నుండి నమోదయ్యాయి. ప్రస్తుతం జమ్ముకాశ్మీర్ లో 1,819 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జమ్మూ డివిజన్‌లో 894, కశ్మీర్ డివిజన్‌లో 925 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలావుంటే.. ఓమిక్రాన్ వేరియంట్ కారణంగా బుధవారం భారత్ లో మొదటి మరణం నమోదయ్యింది. ఓమిక్రాన్ నగరాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకు దేశంలో 2,135 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ఢిల్లీ తర్వాతి స్థానంలో ఉంది.