వైరల్‌గా మారిన బస్సు డ్రైవర్ ఫోటో.. ఎందుకో తెలుసా?

Jammu Kashmir First Woman Driver. ఒకప్పుడు మహిళలు అంటే కేవలం కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ

By Medi Samrat  Published on  28 Dec 2020 8:30 AM GMT
వైరల్‌గా మారిన బస్సు డ్రైవర్ ఫోటో.. ఎందుకో తెలుసా?

ఒకప్పుడు మహిళలు అంటే కేవలం కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ వంటింటికి మాత్రమే పరిమితం అయ్యేవారు.కానీ కాలం మారుతున్న కొద్ది ప్రజలలో కూడా మార్పు వచ్చింది మహిళలు కూడా దేనినైనా సాధించగలరనే ఆత్మ విశ్వాసం వారిలో పెరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రతి రంగంలోనూ పురుషులకు ధీటుగా మహిళలు రాణిస్తున్నారు. ఒకవైపు కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ, మరోవైపు వారి వృత్తిరీత్యా పనులను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అన్ని రంగాలలో మహిళలు రాణిస్తూ తమదైన ముద్రను వేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా జమ్మూ కాశ్మీర్ లో బస్సు డ్రైవర్ గా ఓ మహిళ ఉండడం ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు.



జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాకు చెందిన పూజ దేవి అనే ఓ మహిళ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఏకంగా బస్సు డ్రైవర్ అయ్యింది. ఇందులో భాగంగానే డ్రైవర్ సీట్లో కూర్చున్న ఆమె విక్టరీ సంకేతం చూపుతున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మహిళా బస్సు డ్రైవర్ ఫోటో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అంతేకాకుండా"జమ్మూ కాశ్మీర్ మొదటి మహిళా బస్సు డ్రైవర్ పూజ దేవి కధువా జిల్లాకు చెందినదానివై నందుకు మాకు ఎంతో గర్వంగా ఉందంటూ" కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

ఈ పూజ దేవి ఫోటో డిసెంబర్ 25న కేంద్రమంత్రి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఇప్పటికే ఎన్నో వేల లైక్ లను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ ఫోటో చూసిన సదరు నెటిజన్లు మహిళా ఓ గొప్ప శక్తి అని, మహిళలు తలచుకుంటే దేనినైనా సాధించగలరు అంటూ, ఈ ఫోటో మరెంతో మంది మహిళలకు స్ఫూర్తి నింపుతుందని తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.



Next Story