అంతరిక్షయాత్రలో వ్యోమగాములకు.. చికెన్ బిర్యానీ, సాంబార్ అన్నం
ISRO is preparing food for gaganyaan astronauts. 'గగన్‌యాన్' ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మంకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం
By అంజి Published on 15 Dec 2021 2:43 AM GMT'గగన్‌యాన్' ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మంకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం వ్యోమగాములకు శిక్షణ జరుగుతోంది. కాగా వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత వారు తినే ఆహార పదార్థాల తయారీ కూడా ప్రారంభమైందని ఇస్రో తెలిపింది. ఈ ఆహారాన్ని కర్ణాటకలోని డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లెబోరేటరీ తయారు చేస్తోంది. ఈ సందర్భంగా డీఎఫ్‌ఆర్ ఎల్ శాస్త్రవేత్త మధుకర్ మాట్లాడారు. భూమి మీద కూర్చుని, నిల్చుని భోజనం చేయవచ్చు. కానీ అంతరిక్షంలో అలా కాదు. అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి.. మనం తీసుకెళ్లిన ఆహారం గాలిలో తేలుతుంటుంది. ఈ నేపథ్యంలోనే వ్యోమగాముల కోసం స్పెషల్ ఫుడ్‌ను తయారు చేస్తున్నారు.
ఆహార పదార్థాల జాబితాను సిద్ధం చేశామని, వాటిని పరీక్షిస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. గగన్‌యాన్ ప్రాజెక్టు ద్వారా అంతరిక్షంలోకి వెళ్తున్న ముగ్గురు వ్యోమగాములు కూడా భారతీయులే కావడంతో.. వారికి భారతీయ వంటకాలనే సిద్ధం చేస్తున్నారు. వ్యోమగాములు ఆహారాన్ని తీసుకునేలా ఓ లిక్విడ్ డెలివరీ సిస్టమ్‌ను తయారు చేశారు. ప్రపంచ స్థాయి వంటశాల మన దగ్గర ఉందని, అందులోకి క్రిములు కూడా ప్రవేశించలేవని.. అందులోనే వ్యోమగాముల ఆహారం తయారు చేస్తామని శాస్త్రవేత్తలు చెప్పారు. అంతరిక్షంలో వ్యోమగాములు వాటిని తినొచ్చన్నారు.
అయితే అంతకు ముందు.. ఆహార పదార్థాలను ఇస్రోకు పంపిస్తాము. ఆ తర్వాత తుది జాబితాను సిద్ధం చేస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ కూర్మ, దాల్ మఖ్కని, షాహీ పనీర్, సూజి హల్వా, చికెన్ కట్టి రోల్, వెజ్ కట్టి రోల్, ఎగ్ కట్టి రోల్, స్టఫ్డ్ పరోటా, మ్యాంగో నెక్టర్, పైనాపిల్ జూస్, టీ, కాఫీల, రాజ్మా చావల్, సాంబార్ చావల్, దాల్ చావల్, రెడీ టు ఈట్ ఎనర్జీ బార్స్‌ను వ్యోమగాముల ఆహారం కోసం సిద్ధం చేస్తున్నారు. గగన్‌యాన్ యాత్ర 2022 చివరినాటికి లేదా 2023 ప్రారంభంలో జరిగే ఛాన్స్ ఉంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవలే తెలిపారు.