ట్రైన్ లో ప్ర‌యాణం.. ఊహించ‌ని మ‌ర‌ణం

Iron Rod Pierces Through Train Passenger's Neck In Freak Accident In UP. ప్రయాగ్‌రాజ్ సమీపంలో శుక్రవారం ఒక వ్యక్తి రైలు ప్రయాణం చేస్తూ ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయాడు.

By Medi Samrat  Published on  2 Dec 2022 9:45 PM IST
ట్రైన్ లో ప్ర‌యాణం.. ఊహించ‌ని మ‌ర‌ణం
ప్రయాగ్‌రాజ్ సమీపంలో శుక్రవారం ఒక వ్యక్తి రైలు ప్రయాణం చేస్తూ ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయాడు. బయటి నుండి అతని కోచ్‌లోకి ఇనుప రాడ్ దూసుకొచ్చింది. కిటికీకి అతి దగ్గరగా ఉన్న అతడి మెడకు గుచ్చుకోవడంతో ఆ ప్రయాణీకుడు మరణించాడు. ఘటన జరిగినప్పుడు బాధితుడు నీలాంచల్ ఎక్స్‌ప్రెస్‌లో కార్నర్ సీటులో కూర్చొని ఉన్నాడు. మృతదేహాన్ని అలీఘర్ జంక్షన్ స్టేషన్‌లో రైల్వే పోలీసులకు అప్పగించారు. చనిపోయిన వ్యక్తిని ఆ వ్యక్తిని హరికేష్ దూబేగా గుర్తించారు. ఆ ప్రాంతంలో రైల్వే ట్రాక్ లేయింగ్ పనులు చేపడుతున్నట్లు సంబంధిత వర్గాలు ధృవీకరించాయి. ఈ ఘటనకు సంబంధించి RPF/GRP సంయుక్త దర్యాప్తు చేస్తోంది. ప్రయాణీకుడు హరికేష్ కుమార్ దూబే తన సీటులో రక్తపు మడుగుతో కళ్ళు మూసుకుని కూర్చున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్తున్న నీలానాచల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఉత్తర మధ్య రైల్వేలోని ప్రయాగ్‌రాజ్ డివిజన్‌లోని దన్వర్- సోమ్నా మధ్య ఉదయం 8:45 గంటలకు ఈ ఘటన జరిగింది. రైలును అలీఘర్ జంక్షన్‌లో నిలిపివేసి మృతదేహాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసులకు అప్పగించారు.. దర్యాప్తు జరుగుతోందని భారతీయ రైల్వే తెలిపింది.


Next Story