ప్రపంచ దేశాల్లో ఇండియా పేరు మార్మోగుతుంది: సీఎం చంద్రబాబు

ఇండియా డెవలప్‌మెంట్‌ను ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

By Knakam Karthik  Published on  3 Feb 2025 10:31 AM IST
National News, AP Cm Chandrababu, Delhi Assembly Elections Campaign, Pm Modi, Aap, Bjp

ప్రపంచ దేశాల్లో ఇండియా పేరు మార్మోగుతుంది: సీఎం చంద్రబాబు

ఇండియా డెవలప్‌మెంట్‌ను ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఐటీపై, నేడు ఏఐపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయనే విషయాన్ని ఇటీవల తాను దావోస్ పర్యటనలో గమనించానని చెప్పారు. కానీ ఏఐ సాంకేతికతలో భారత్ ఇప్పటికే ముందు ఉందని కితాబిచ్చారు. ప్రపంచ దేశాల్లో ఇండియా పేరు మార్మోగుతోందని, 2047 కల్లా భారత్ అభివృద్ది చెందిన దేశాల సరసన నిలుస్తుందని దీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఏఐ సాంకేతికతలో మన దేశం ప్రముఖ పాత్ర వహించనుందని అన్నారు. తాజాగా బడ్జెట్‌లో కేటాయింపులు చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోందని కొనియాడారు. వికసిత్ భారత్ టార్గెట్స్‌కు అనుగుణంగా 2025-26 వార్షిక బడ్జెట్‌లో కేటాయింపులు చేశారని ఆయన గుర్తు చేశారు.

అదేవిధంగా మౌలిక వసతులు కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. పన్ను సంస్కరణలో చాలా మార్పలు జరిగాయని.. ఇంకొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయని తెలిపారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు ఏపీలోనే ప్రథమంగా జరిగాయని గుర్తు చేశారు. ఎంఎస్ఎంఈ పాలసీ గేమ్ ఛేంజర్‌గా మారబోతోందని కామెంట్ చేశారు. ఇప్పుడు పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్ట్‌నర్‌షిప్ విధానంతో భారత్‌లో పెట్టుబడులకు చాలా మంది ముందుకు వస్తున్నారని అన్నారు. పలు రంగాల్లో భారీగా పెట్టుబడులు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. దీంతో నూతన ఆవిష్కరణలతో పాటు మౌలిక సాదుపాయాల కల్పన పెరుగుతోందని అన్నారు.

Next Story