ఆయుధాలకై రష్యాతో భారత్ ఎమర్జెన్సీ డీల్..!

Indian Air Force Signs Emergency Deal With Russia. భారత రక్షణ దళాల ఆయుధ వ్యవస్థల ఆధునికీకరణ వేగవంతమైంది. ఈ మేర‌కు భారత వాయుసేన

By Medi Samrat  Published on  28 Aug 2021 11:24 AM GMT
ఆయుధాలకై రష్యాతో భారత్ ఎమర్జెన్సీ డీల్..!

భారత రక్షణ దళాల ఆయుధ వ్యవస్థల ఆధునికీకరణ వేగవంతమైంది. ఈ మేర‌కు భారత వాయుసేన రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఉన్న ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్స్‌కు బదులుగా ఏకే-103 అజాల్ట్ రైఫిల్స్‌ను సమకూర్చుకోబోతోంది. రూ.300 కోట్లతో దాదాపు 70 వేల ఏకే-103 అజాల్ట్ రైఫిల్స్ కొనుగోలుకు భారత వాయు సేన(ఐఏఎఫ్) రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా దళాలు వదిలేసిన ఆయుధాలు భారత్‌లోని ఉగ్రమూకలకు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యవసర నిబంధనల క్రింద ఐఏఎఫ్ ఈ ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఐఏఎఫ్‌కు 1.5 లక్షలకు పైగా అజాల్ట్ రైఫిల్స్ అవసరం కాగా.. రైఫిల్స్ కొనుగోలుకు ఐఏఎఫ్ రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రైఫిల్స్ రానున్న మరికొద్ది నెలల్లో ఐఏఎఫ్‌కు చేరుకోవచ్చు. అలాగే.. ఏకే-103 కన్నా ఎక్కువ సామర్థ్యంగల ఏకే-203 రైఫిల్స్ కొనుగోలుకు కూడా రష్యాతో ఒప్పందానికి చర్చలు జరుగుతున్నట్లు స‌మాచారం. ఒప్పందం మేర‌కు ఆయుధాలు అందుబాటులోకి వస్తే.. ఉగ్రవాద చర్యలను మరింత సమర్థవంతంగా తిప్పికొట్టడానికి వీలవుతుంది. వీటిని మొదట జమ్మూ-కశ్మీరు, శ్రీనగర్, కీలక వాయు సేన స్థావరాల్లోని దళాలకు అందజేస్తారు.


Next Story