Video : ఉగ్రవాద స్థావరాలను సెకన్లలో ఎలా ధ్వంసం చేశారో చూశారా.?
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి భారత్ ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రతీకారం తీర్చుకుంది.
By Medi Samrat
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి భారత్ ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రతీకారం తీర్చుకుంది. మే 6, 7వ తేదీలలో రాత్రి సమయంలో భారతదేశం పాకిస్తాన్ మరియు పిఓకెలోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.
అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడానికి భారత సైనికులకు కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే పట్టింది. ఇదిలా ఉండగా.. ఆదివారం నాడు భారత వైమానిక దళం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. ఇందులో పాకిస్తాన్, పిఓకెలోని ఉగ్రవాద శిబిరాలపై చేసిన దాడులను చూడవచ్చు.
Indian Air Force -Touch the Sky with Glory#IndianAirForce#YearOfDefenceReforms@DefenceMinIndia@SpokespersonMoD@HQ_IDS_India@adgpi@IndiannavyMedia@indiannavy@CareerinIAF pic.twitter.com/FhFa3h8yje
— Indian Air Force (@IAF_MCC) August 10, 2025
ఆదివారం భారత వైమానిక దళం ఐదు నిమిషాల వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ వీడియో క్లిప్‌లో వార్తాపత్రికలో మొదట ప్రచురించబడిన ఏప్రిల్ 22 నాటి పహల్గామ్ దాడి వార్త చూడవచ్చు. ఇందులో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. క్లిప్‌లో ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్, సీడీఎస్ అనిల్ చౌహాన్ మరియు త్రివిధ దళాల అధిపతులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని చూపించారు. ఆ వీడియోలో బ్లాక్ స్క్రీన్‌పై ఆపరేషన్ సింధూర్ అని రాసి ఉంది. దీని తర్వాత భారత వైమానిక దళం ఖచ్చితత్వం, వేగం, సంకల్పంతో స్పందించింది.
దీని తరువాత పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద లక్ష్యాలపై భారత యుద్ధ విమానాలు ఎలా దాడి చేశాయో వీడియోలో చూడవచ్చు. ఈ దాడిలో ధ్వంసమైన ఉగ్రవాదుల స్థావరాలకు సంబంధించిన క్లిప్‌లు కూడా ఈ వీడియోలో కనిపించాయి.
ఈ వీడియోలో 1971లో పాకిస్థాన్‌తో యుద్ధ సమయంలో యుద్ధ విమానాల చర్యలను కూడా చూపించారు. ఇది మాత్రమే కాదు.. IAF షేర్ చేసిన వీడియో కార్గిల్ యుద్ధం, 2019లో పుల్వామా దాడికి ప్రతిస్పందనగా భారతదేశ దాడులను ప్రస్తావిస్తుంది.