ఊహించని శిక్ష విధిస్తాం, ప్రతీకారం తీర్చుకుంటాం..మోడీ స్ట్రాంగ్ వార్నింగ్

పహల్గామ్‌లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులకు ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు

By Knakam Karthik
Published on : 24 April 2025 1:35 PM IST

National News, Pm Modi, Bihar, Jammu and Kashmir, Pahalgham Attack

ఊహించని శిక్ష విధిస్తాం, ప్రతీకారం తీర్చుకుంటాం..మోడీ స్ట్రాంగ్ వార్నింగ్

పహల్గామ్‌లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులకు ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా బిహార్‌లో మోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మోడీ రూ.13,480 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు నమో భారత్ రైలును ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..పహల్గాం ఉగ్రదాడి మృతులకు ఆయన నివాళులర్పించారు. అదేవిధంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. మృతుల ఆత్మశాంతి కోసం సంతాపం తెలపాలని సభకు వచ్చిన వారిని కోరారు. పహల్గాంలో ఉగ్రమూకలు నరమేధం సృష్టించారని కామెంట్ చేశారు.

ఇది పర్యాటకులపై దాడి కాదు.. భారత్‌పై జరిగిన దాడి ప్రాణాలు కోల్పోయిన వారికి దేశమంతా నివాళులర్పిస్తోంది. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని రీతిలో శిక్షిస్తాం. ఈ విషయంలో ప్రజలకు హామీ ఇస్తున్నా. ప్రతీకారం తీర్చుకుని తీరుతాం. ఉగ్రవాదులకు అగ్రనేతలుగా చలామణి అవుతోన్న వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదు.. భారత్‌పై జరిగిన దాగడిగానే భావిస్తాం...అని మోడీ పేర్కొన్నారు.

Next Story