ఈ ఘనత భారతదేశ స్వావలంబనకు నిదర్శనం : మోదీ

India to achieve historical feat of giving 1.5 bn COVID Vac doses today. సంవత్సరం లోపే 1.5 బిలియన్ల కోవిడ్ వ్యాక్సినేషన్ డోస్‌లను అందించడం ద్వారా భారత్

By Medi Samrat  Published on  7 Jan 2022 3:13 PM IST
ఈ ఘనత భారతదేశ స్వావలంబనకు నిదర్శనం : మోదీ

సంవత్సరం లోపే 1.5 బిలియన్ల కోవిడ్ వ్యాక్సినేషన్ డోస్‌లను అందించడం ద్వారా భారత్ ఈ రోజు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోనుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్ర‌వారం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ (సిఎన్‌సిఐ) రెండవ క్యాంపస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. "దేశం 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల యువకులకు టీకాలు వేయడంతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించింది. సంవత్సరంలో మొదటి నెల మొదటి వారంలో ఈ రోజు ఒక సంవత్సరం కంటే తక్కువ వ్యవధిలో 1.5 బిలియన్ల కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లను పంపిణీ చేయడం ద్వారా రికార్డు సాధించామ‌ని.. ఈ ఘనత భారతదేశ స్వావలంబనకు నిదర్శనం" అని అన్నారు.

"గణాంకాల పరంగా, ఇది భారీ సంఖ్య. ప్రపంచంలోని అన్ని పెద్ద‌ దేశాలకు ఇది ఆశ్చర్యం కలిగించక‌పోవ‌చ్చు. అయినప్పటికీ, ఇది దేశం యొక్క 130 మిలియన్ల పౌరుల‌ సామర్థ్యానికి సంకేతం. ఇది ఆత్మవిశ్వాసం మరియు స్వాతంత్ర్యానికి చిహ్నం" అని మోదీ అన్నారు. అక్టోబర్ 2021లో.. దేశం 100 కోట్ల కోవిడ్ వ్యాక్సినేషన్ డోస్‌ల మైలురాయిని దాటింది.

ఇదిలావుంటే.. చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ రెండవ క్యాంపస్ ను సుమారు రూ. 530 కోట్లతో నిర్మించారు. కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 400 కోట్లు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మిగిలిన రూ.130 కోట్లు అంటే.. 75:25 ప‌ర‌స్ప‌ర‌ సహకారంతో అభివృద్ధి చేయబడింది. కాంప్లెక్స్‌లో అత్యాధునిక క్యాన్సర్ నిర్ధారణ, స్టేజింగ్, చికిత్స, సంరక్షణ మౌలిక సదుపాయాలతో కూడిన 460 పడకల క్యాన్సర్ చికిత్స‌ కేంద్రంగా నిర్మిత‌మైంది.

న్యూక్లియర్ మెడిసిన్(PET), 3.0 టెస్లా MRI, 128 స్లైస్ CT స్కానర్, రేడియోన్యూక్లైడ్ థెరపీ యూనిట్, ఎండోస్కోపిక్ సూట్, కాంటెంపరరీ బ్రాకీథెరపీ పరికరాలు మరియు ఇతర అధునాతన సౌకర్యాలు క్యాంపస్‌లో అందుబాటులో ఉన్నాయి. క్యాంపస్ అత్యాధునిక క్యాన్సర్ పరిశోధనా సంస్థగా కూడా పనిచేస్తుంది. అలాగే క్యాన్సర్ రోగులకు, ముఖ్యంగా దేశంలోని తూర్పు మరియు ఈశాన్య ప్రాంతాలకు చెందిన వారికి సమగ్ర సంరక్షణను అందించ‌నున్న‌ట్లు తెలుపుతున్నారు.


Next Story