ఉత్తరాఖండ్‌లో అందరి క్షేమం కోసం యావత్తు దేశం ప్రార్థిస్తోంది : ప్రధాని మోదీ

India Stands With Uttarakhand Tweets PM Modi On Glacier Break. ఉత్తరాఖండ్‌లో అకస్మాత్తుగా సంభవించిన వరదలపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on  7 Feb 2021 12:38 PM GMT
India Stands With Uttarakhand Tweets PM Modi On Glacier Break.

ఉత్తరాఖండ్‌లో అకస్మాత్తుగా సంభవించిన వరదలపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దురదృష్ఠకర పరిస్థితిపై తాను నిరంతరం పరిశీలిస్తున్నట్లు ఆదివారం ఓ ట్వీట్లో పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లోని అందరి క్షేమం, రక్షణ కోసం యావత్తు దేశం ప్రార్థిస్తోందని అన్నారు. అయితే రాష్ట్ర ఉన్నతాధికారులతో నిరంతరం మాట్లాడుతున్నానని, ఎన్‌డీఆర్ఎఫ్‌ నిర్వహిస్తున్న సహాయ, పునరావాస కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని అన్నారు.

మోదీ ప్రస్తుతం అసోం పర్యటనలో ఉన్నారు. ఉత్తరాఖండ్‌ వరదలపై ఆయన సమీక్ష జరిపారని ప్రధాన కార్యాలయం తెలిపింది. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర రావత్‌, ఉన్నతాధికారులతో మోదీ మాట్లాడారని ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న సహాయక కార్యక్రమాల గురించి వివరంగా తెలుసుకున్నారని తెలిపింది. వరద ప్రభావిత ప్రజలకు అవసరమైన అన్ని సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కూడా ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డీజీ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్ అధికారులు, ఐటీబీపీ డీజీ ఎస్‌ఎన్‌ దేశ్వాల్‌లతో మాట్లాడారు. వరద పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు.

కాగా, ఉత్తారఖండ్‌లో భారీ మంచుకొండ విరిగిపడింది. దీంతో ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. మంచు ఖండం కరిగిపోవడంతో ఉత్తరాఖండ్‌లో కొన్ని ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. చమోలీ జిల్లాలోని జోషి మఠ్‌లో ధౌలి గంగా నదికి వరదలు రావడంతో తపోవన్‌లోని రుషి గంగ పవన్‌ ప్రాజెక్టుకు నష్టం వాటిల్లింది. ఈ దుర్గటనలో దాదాపు 150 వరకు గల్లంతయ్యారు.
Next Story
Share it