మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో జనాభా నియంత్రణ చట్టాన్ని కూడా తీసుకుని రావాలని డిమాండ్ చేశారు. నాగా సాధువులను హైదరాబాద్‌కు పంపితే, 15 నిమిషాలు చాలంటూ వ్యాఖ్యలు చేసిన వ్యక్తులు పాకిస్థాన్‌కు పారిపోతారని రాజా సింగ్ అన్నారు.
సైఫ్ అలీ ఖాన్ లవ్ జీహాద్ లో భాగమని రాజా సింగ్ విమర్శించారు. సైఫ్ అలీ ఖాన్ హిందూ నటీమణులను పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. సైఫ్ అలీ ఖాన్ 1991లో అమృతా సింగ్‌ను వివాహం చేసుకున్నాడని, ఆపై తన కుమార్తె వయస్సు ఉన్న కరీనా కపూర్‌ను వివాహం చేసుకున్నాడని ఆరోపించారు రాజా సింగ్. పాకిస్థాన్‌లో హిందువుల శాతం క్షీణించడంపై మాట్లాడుతూ, భారతదేశంలో జనాభా నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయాలని ప్రజలను కోరారు.