భార్యను వదిలించుకోవడానికి కోడలితో కలిసి మామ మాస్టర్ ప్లాన్..!
Husband took scary step to get rid of his wife. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో అత్తని హత్య చేశారన్న ఆరోపణలపై కోడలు
By Medi Samrat Published on 17 July 2022 8:03 PM IST
మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో అత్తని హత్య చేశారన్న ఆరోపణలపై కోడలు, మామలను పోలీసులు అరెస్టు చేశారు. మామ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెని పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నాడు. ఆ తర్వాత కోడలు సహాయంతో భార్యను చంపేశాడు. ఆ తర్వాత కట్టుకథ అల్లుతూ పోలీసులను తప్పుదోవ పట్టించారు. కానీ కఠినంగా విచారించగా.. అసలు విషయం బయటపడింది. ఈ సంచలన ఘటన మంగవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్రైలా గ్రామంలో వెలుగు చూసింది. కోడలు అత్తని హత్య చేసింది. నాలుగు రోజుల క్రితం గ్రామంలో ఓ మహిళ హత్య కేసు నమోదైంది. శుక్రవారం నాడు చనిపోయిన మహిళ కోడలు, ఆమె భర్తను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరో మహిళతో ఉన్న సంబంధం కారణంగానే భార్యను హతమార్చేందుకు కోడలుతో కలిసి మహిళ భర్త కుట్ర పన్నినట్లు చెబుతున్నారు.
విచారణలో నిందితులు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడించారు. అనంతరం ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఆ మహిళ భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మరోవైపు కోడలికి అత్తతో కనీసం పడేది కాదు. దీంతో విసిగిపోయిన కోడలు.. మామయ్యతో కలిసి కుట్ర పన్ని కొడవలితో దాడి చేసి హతమార్చాడు. విషయం పోలీసులకు తెలియడంతో.. వెంటనే ఆ మహిళ భర్తను అదుపులోకి తీసుకున్నారు. వాల్మీకి కోల్ అనే వ్యక్తి మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడని, తన భార్య సరోజను అడ్డు తొలగించుకోవాలని భావించాడు. దేంతో ఆమె గొంతు కోసేందుకు తన కోడలు కంచన్ కోల్ (25)కి రూ.4వేలు సుపారీగా ఇచ్చాడని పోలీసులు చెబుతున్నారు. సరోజ్ (50) జూలై 12న తన ఇంట్లో శవమై కనిపించింది.