ఉన్నట్టుండి భూమిలో గుంతలు.. ఇళ్లకు పగుళ్లు.. భయాందోళనలో ప్రజలు

Houses, land cracked in Jharkhand. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ పరిధిలోని భుర్కుందలో భూమిలో గుంతలు ఏర్పడిన ఘటన స్థానికంగా భయాందోళన కలిగించింది.

By అంజి  Published on  7 Jan 2022 11:13 AM IST
ఉన్నట్టుండి భూమిలో గుంతలు.. ఇళ్లకు పగుళ్లు.. భయాందోళనలో ప్రజలు

జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ పరిధిలోని భుర్కుందలో భూమిలో గుంతలు ఏర్పడిన ఘటన స్థానికంగా భయాందోళన కలిగించింది. భూమి కుంగిపోవడం, ఇళ్లకు పగుళ్లు రావడంతో స్థానికులు భయపడ్డారు. బర్కస్యాల్ ఏరియా సీసీఎల్ ఏలో జరిగిన ఈ ఘటన పరిసర ప్రాంతంలో కలకలం రేపింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయితే ప్రజల్లో కచ్చితంగా భయాందోళనలు ఉన్నాయి. వాస్తవానికి నాకస్యాల నకరి కాలనీలో మూసి ఉన్న గనిలో కొంత భాగం పెద్ద శబ్ధంతో కూలిపోయింది. దీంతో సమీపంలోని ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు తమ ఇళ్లలో ఉన్న వస్తువులను ఇతర ప్రాంతాలకు తరలించడం ప్రారంభించారు.

ఘటనానంతరం జిల్లా యంత్రాంగం సంక్షేమం దిశగా చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఎప్పుడైనా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు. సంఘటన తర్వాత, సీసీఎల్‌ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆపై సంఘటనా స్థలానికి సమీపంలో ముప్పు పొంచి ఉన్నందున మొత్తం ప్రాంతాన్ని అసురక్షితంగా ప్రకటించారు. అదే సమయంలో, అక్కడ నివసిస్తున్న ప్రజలను కూడా ఖాళీ చేయమని పరిపాలన ఆదేశించింది. రెండేళ్ల క్రితం రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆ తర్వాత 50 అడుగుల మేర భూమిలో పగుళ్లు ఏర్పడ్డాయి. భూమిలో ఎక్కువ భాగం గుంతలో పూడ్చబడింది.

Next Story