ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన య‌జ‌మానిని కాపాడుకునేందుకు ఆ గుర్రం చాలా ప్ర‌య‌త్నించింది.. కానీ..

ఒక వ్యక్తి స్నేహంలో ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒక‌రికి ద్రోహం చేసే అవ‌కాశం ఉంది. కానీ జంతువుతో స్నేహంగా ఉంటే.. అవి మ‌న మరణం వరకు కొనసాగిస్తాయి

By Medi Samrat  Published on  23 April 2024 2:59 AM GMT
ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన య‌జ‌మానిని కాపాడుకునేందుకు ఆ గుర్రం చాలా ప్ర‌య‌త్నించింది.. కానీ..

ఒక వ్యక్తి స్నేహంలో ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒక‌రికి ద్రోహం చేసే అవ‌కాశం ఉంది. కానీ జంతువుతో స్నేహంగా ఉంటే.. అవి మ‌న మరణం వరకు కొనసాగిస్తాయి. అలాంటి ఘటనే మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం దినారా పోలీస్ స్టేషన్ పరిధిలోని సెమ్రా గ్రామంలో ఆదివారం-సోమవారం మ‌ద్య‌ రాత్రి వేళ‌ వెలుగులోకి వచ్చింది. రైడర్, గుర్రం ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. అయినప్పటికీ గాయపడిన గుర్రం తన యజమాని గాయం గురించి తెలియజేయడానికి అర్ధరాత్రి రైడర్ ఇంటికి వెళ్లింది. గాయపడిన వ్య‌క్తి కుటుంబ స‌భ్యుల‌ను నిద్రలేపి.. ప్రమాద స్థలానికి తీసుకువెళ్లింది.. అయితే రైడర్‌ను చికిత్స కోసం గ్వాలియర్‌కు తీసుకెళుతుండగా మరణించాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


సమాచారం ప్రకారం.. సెమ్రా గ్రామ నివాసి అచ్చెలాల్ యాదవ్‌కు గుర్రం ఉంది.. దానిని అతడి కుమారుడు అఖిలేష్ చూసుకునేవాడు. ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం ఏడు గంటలకు కడోరా లోధిలో నివాసముంటున్న ముకుండి పాల్ కుమార్తె వివాహానికి అఖిలేష్ గుర్రంపై పెళ్లి ఊరేగింపు కోసం వెళ్లాడు. ఆ తర్వాత రాత్రి 2 గంటల ప్రాంతంలో తిరిగి వస్తుండగా.. ఇంటికి అరకిలోమీటర్ దూరంలో గుర్తు తెలియని వాహనం గుర్రంతో పాటు అఖిలేష్‌ను ఢీకొట్టడంతో ప్రమాదంలో గుర్రం, అఖిలేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అఖిలేష్ అక్కడికక్కడే కుప్ప‌కూలిపోయాడు.

ఇది చూసిన గుర్రం గాయపడి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా కొట్టడం ప్రారంభించింది. గుర్రం శబ్ధం విన్న అఖిలేష్ సోదరుడు నరేష్ నిద్రలేచి.. గుర్రాన్ని గాయ‌లు చూసి.. ఏదో అవాంఛనీయమైన ఘ‌ట‌న జ‌రిగింద‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చాడు. ఆ తర్వాత గుర్రం ప్రమాద స్థలం వైపు వెళ్లగా.. నరేష్ బైక్‌పై వెనుకనే దానిని అనుస‌రించాడు. సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా అఖిలేష్ గాయపడి పడి ఉన్నాడు. అనంతరం గ్రామంలోని ఓ యువకుడి కారులో అఖిలేష్‌ను చికిత్స నిమిత్తం ఝాన్సీ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లగా.. అక్కడ మెరుగైన వైద్యం అందకపోవడంతో.. గ్వాలియర్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో అఖిలేష్ మృతి చెందాడు.

Next Story