బిపిన్ రావ‌త్ చివ‌రి మాట‌లు అవే.. రాత్రంతా నిద్ర పట్టలేదు.. ప్ర‌త్య‌క్ష సాక్షి క‌న్నీటి ప‌ర్యంత‌ం

He Asked For Water.. Eyewitness Claims He Saw General Rawat After Crash. జనరల్ బిపిన్ రావత్, మరో 12 మంది తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్‌ కూలడంతో మృతి చెందారు. కాగా ఘటన జరిగిన ప్రదేశంలో ఒక సాక్షి.. కొండలలో హెలికాప్టర్‌ శిథిలాలు

By అంజి  Published on  9 Dec 2021 6:52 PM IST
బిపిన్ రావ‌త్ చివ‌రి మాట‌లు అవే.. రాత్రంతా నిద్ర పట్టలేదు.. ప్ర‌త్య‌క్ష సాక్షి క‌న్నీటి ప‌ర్యంత‌ం

బుధవారం నాడు జనరల్ బిపిన్ రావత్, మరో 12 మంది తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్‌ కూలడంతో మృతి చెందారు. కాగా ఘటన జరిగిన ప్రదేశంలో ఒక సాక్షి.. కొండలలో హెలికాప్టర్‌ శిథిలాలు గుర్తించిన కొద్ది క్షణాల తర్వాత జనరల్‌ను సజీవంగా చూశానని చెప్పాడు. శివ కుమార్ అనే కాంట్రాక్టర్ తన సోదరుని వద్దకు వెళుతున్నాడు. అతను టీ ఎస్టేట్‌లో పనిచేస్తున్నాడు. నిన్న మధ్యాహ్నం నీలగిరిలోని కూనూర్ సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్‌లో మంటలు చెలరేగి పడిపోవడం తాను చూశానని శివ కుమార్ పేర్కొన్నాడు. అతనితో పాటు ఇతరులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. "మేము మూడు మృతదేహాలు పడిపోవడం చూశాము... ఒక వ్యక్తి సజీవంగా ఉన్నాడు. అతను నీరు అడిగాడు. మేము అతనిని బెడ్‌షీట్‌ కప్పి బయటకు తీసుకువచ్చాము. అతనిని రెస్క్యూ సిబ్బంది ఆస్పత్రికి తీసుకువెళ్లారు." అని శివ కుమార్ చెప్పారు.

మూడు గంటల తర్వాత తాను మాట్లాడిన వ్యక్తి జనరల్ బిపిన్ రావత్ అని ఎవరో చెప్పారని, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఫోటోను చూపించారని ఆయన చెప్పారు. "ఈ వ్యక్తి దేశం కోసం ఇంత చేశాడంటే నమ్మలేకపోయాను.. నీళ్లు కూడా ఇవ్వలేకపోయాను. రాత్రంతా నిద్ర పట్టలేదు" అని శివ కుమార్ కంటతడి పెట్టారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో జనరల్ రావత్ మృతి చెందారు. ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు ట్రై-సర్వీస్ విచారణను ఏర్పాటు చేసినట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటుకు తెలిపారు. కోయంబత్తూరులోని సూలూర్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి వెల్లింగ్టన్‌కు వెళ్తుండగా హెలికాప్టర్ కుప్పకూలడంతో జనరల్ రావత్, ఆయన భార్య మధులికా రావత్, మరో 11 మంది చనిపోయారు.

వెల్లింగ్టన్‌లోని మిలిటరీ ఆసుపత్రిలో తీవ్ర కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అతను లైఫ్ సపోర్ట్‌లో ఉన్నాడు. Mi17 V5 హెలికాప్టర్ బుధవారం ఉదయం 11:48 గంటలకు సూలూర్ ఎయిర్ బేస్ నుండి బయలుదేరింది మరియు మధ్యాహ్నం 12:15 గంటలకు వెల్లింగ్‌టన్‌లో ల్యాండ్ అవుతుందని భావించారు. అయితే మధ్యాహ్నం 12.08 గంటల ప్రాంతంలో ఛాపర్ రాడార్‌కు దూరమైంది. కాగా బ్లాక్ బాక్స్ దొరకడంతో హెలికాప్టర్ ఎందుకు కూలిపోయిందో తెలిసే అవకాశం ఉంది.

Next Story