ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పథకం కింద పనిచేస్తున్న కూలీల జీవనోపాధిపై కేంద్ర ప్రభుత్వం ప్రభావం చూపిందని ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు మంగళవారం మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు తీసుకొచ్చిందని.. కానీ కేంద్రం కేవలం 20 పనులకే కార్మికులను పరిమితం చేసి.. చాలా మందికి ఉపాధి లేకుండా చేసిందని హరీష్ రావు విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో చాలా మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని అన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది కార్మికుల ఆర్థిక స్థితిని దెబ్బతీశారని కేంద్రంపై ఫైర్ అయ్యారు. MGNREGA పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారని తెలిపారు. కానీ కేంద్ర ప్రభుత్వం చాలా మంది కార్మికుల జీవనోపాధిని ప్రభావితం చేసే పథకాన్ని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.