పేషంట్ల మ‌ధ్య గొడ‌వ‌.. ట్రక్కుతో ఆసుపత్రిని 8 సార్లు ఢీ.. వీడియో వైర‌ల్‌

Gurugram man rams truck inside hospital. ఆస్ప‌త్రిలో చికిత్స కోసం వ‌చ్చిన ఓ ఇద్ద‌రు పెద్ద‌వాళ్ల గొడ‌వ జ‌రిగింది.

By Medi Samrat  Published on  20 Dec 2020 8:30 AM GMT
పేషంట్ల మ‌ధ్య గొడ‌వ‌.. ట్రక్కుతో ఆసుపత్రిని 8 సార్లు ఢీ.. వీడియో వైర‌ల్‌

ఆస్ప‌త్రిలో చికిత్స కోసం వ‌చ్చిన ఓ ఇద్ద‌రు పెద్ద‌వాళ్ల గొడ‌వ జ‌రిగింది. ఈ గొడ‌వ కాస్త కొట్టుకునే దాకా వెళ్ల‌డంతో.. ఆ పెద్ద‌వాళ్ల కుటుంబ‌స‌భ్యుల్లోని ఓ వ్య‌క్తి కోపంతో ట్ర‌క్కుతో ఆస్ప‌త్రి ప్ర‌హారీ గోడ‌ను ఢీ కొట్టాడు. ఇలా ఒక‌టి కాదు రెండు కాదు ఎనిమిది సార్లు చేశాడు. ఈ ఘ‌ట‌న‌లో 15 వాహానాలతో పాటు ఓ మెడిక‌ల్ షాపు ధ్వంసమైంది. ఈ ఘ‌ట‌న హ‌ర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో జ‌రిగింది.గురుగ్రామ్ లోని బసాయ్ చౌక్ లో ఓ హాస్ప‌ట‌ల్ ఉంది. చికిత్స కోసం ఓ ఇద్ద‌రు పెద్ద‌వాళ్లు వ‌చ్చారు. వాళ్ల‌కి వైద్యులు చికిత్స అందించేందుకు సిద్దం అవ‌గా.. ఆ ఇద్ద‌రి మ‌ధ్య చిన్న‌గా ఏదో గొడ‌వ మొద‌లైంది. అది కాస్త కొట్టుకునే దాకా వెళ్లింది. ఆ పెద్ద‌వాళ్ల‌తో పాటు వారి కుటుంబ స‌భ్యులు అక్క‌డే ఉన్నారు. అందులోని ఓ వ్య‌క్తి ఆగ్ర‌హాంతో బ‌య‌ట‌కు వెళ్లాడు. ఆస్ప‌త్రి ఎదుట నిలిపి ఉంచిన ట్ర‌క్కును తీసుకొచ్చి ఆస్ప‌త్రి ప్ర‌హారీ గోడ‌ను ఢీ కొట్టాడు. ఇలా 8 సార్లు చేసి అక్క‌డ నుంచి ప‌రార‌య్యాడు. ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌హారీ గోడ‌కు అనుకోని ఉన్న మెడిక‌ల్ షాపుతో పాటు 15 వాహానాలు ధ్వంసం అయ్యాయి. ఆస్ప‌త్రి యాజ‌మాన్యం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన వ్య‌క్తి కోసం గాలిస్తున్నారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.


Next Story
Share it