తమిళనాడులోని రామనాథపురానికి చెందిన ఓ బాలిక తన కిడ్డీ బ్యాంకులో పొదుపు చేసుకున్న డబ్బులు రూ. 4,400 అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు విరాళంగా ఇచ్చింది. ఆ పొదుపు మొత్తాన్ని బాలిక, ఆమె తల్లి జిల్లా కలెక్టర్ శంకర్ లాల్ కుమావత్ కు అందజేశారు. ఆర్థిక పరిస్థితి కారణంగా శ్రీలంక వాసులు బాధపడుతున్నందున తన పొదుపు మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు బాలిక తెలిపింది. ఇదిలావుంటే.. శ్రీలంకకు ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) కోటి విరాళంగా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రకటించారు.
డీఎంకేకు చెందిన ఎంపీలు ఒక నెల వేతనాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేసారు. శ్రీలంకకు భారత విరాళాలకు అనుబంధంగా కేంద్రం నుంచి సహాయాన్ని స్టాలిన్ గతంలో అభ్యర్థించారు. రాష్ట్రం యొక్క అభ్యర్థనను మంజూరు చేసినందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంకలో పరిస్థితి "దయనీయంగా ఉంది" అని నొక్కి చెప్పారు. కొలంబోలోని భారత హైకమిషన్ బాలిక తీసుకున్న నిర్ణయాన్ని ట్విట్టర్‌లో ప్రశంసించింది. తమిళనాడు ప్రభుత్వ నిధికి విరాళం ఇవ్వాలని స్టాలిన్ ప్రజలను కోరారు.