లారీకి కట్టేసి.. మెడలో చెప్పుల దండ వేసి..

garlanded with slippers for stealing mobile phone in Paradip. ఓ వ్యక్తిని కదులుతున్న ట్రక్కు ముందు కట్టేసి చెప్పులతో దండ వేశారు.

By Medi Samrat  Published on  25 May 2022 3:30 PM IST
లారీకి కట్టేసి.. మెడలో చెప్పుల దండ వేసి..

ఓ వ్యక్తిని కదులుతున్న ట్రక్కు ముందు కట్టేసి చెప్పులతో దండ వేశారు. ఇదంతా ఎందుకు చేశారంటే మొబైల్ ఫోన్ దొంగిలించాడనే ఆరోపణతో..! ఒడిశాలోని పారాదీప్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని పారాదీప్ లాక్ పోలీసు పరిధిలోని భూతాముండై బ్రిడ్జి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాహనంలో ఉన్న మొబైల్ ఫోన్‌ను దొంగిలించి పారిపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పట్టుకున్నారు.

దీంతో అతడిని ట్రక్కు ముందు కట్టేసి.. చెప్పులతో దండ వేసి కొన్ని నిమిషాల పాటు ట్రక్కును నడిపారు. కదులుతున్న ట్రక్కు ముందు ఓ వ్యక్తికి చెప్పులతో దండలు వేసి ఉంచిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనను స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయమై ఇప్పటివరకు పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు.











Next Story