ఏడుగురు పోలీసులపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు
gangster's daughter found dead during raid. గ్యాంగ్‌స్టర్ కన్హయ్య యాదవ్ కూతురు మృతి కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏడుమంది సిబ్బందిపై
By Medi Samrat
గ్యాంగ్‌స్టర్ కన్హయ్య యాదవ్ కూతురు మృతి కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏడుమంది సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కన్హయ్య యాదవ్ 22 ఏళ్ల పెద్ద కుమార్తె అనుమానాస్పద రీతిలో ఇంట్లో మృతిచెందింది. కన్హయ్ కుమారుడు విజయ్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 154 సెక్షన్ కింద సయ్యిద్‌రాజా పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆదివారం సయ్యిద్‌రాజా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఉదయ్ ప్రతాప్ సింగ్ ఇతర మహిళా కానిస్టేబుళ్లతో కన్హయ్య ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో కన్హయ్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే నిషా అనే అమ్మాయిని విచారించారు.
ఆమెను పోలీసులే చంపినట్లు మరో కుతురు గుంజన్ ఆరోపించింది. వంటిరిగా ఉన్న సమయంలో పోలీసులు ఇంట్లోకి చొరబడి తమను కొట్టినట్లు ఆమె ఆరోపణలు గుప్పించింది. ఘటన చోటు చేసుకున్న తర్వాత తెల్లవారుజామున నిషా తన రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయింది. ఈ ఘటనలో స్థానికులు పోలీసులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో నిరసనలు చెలరేగాయి. "గ్యాంగ్‌స్టర్ కన్హయ్య యాదవ్ కుమార్తె నిషా తన ఇంట్లో శవమై కనిపించింది.పోలీసులు కొట్టారని ఆరోపిస్తూ ఆమె చనిపోయింది" అని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ సంజీవ్ సింగ్ తెలిపారు. గ్యాంగ్‌స్టర్ యొక్క చిన్న కుమార్తెను కూడా కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె కూడా తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నట్లు డీఎం తెలిపారు.