జూదంలో ఏకంగా భార్యను పందెంగా పెట్టిన భర్త.. ఆ తర్వాత ఏమి జరిగిందంటే..

Gambler husband put wife at stake. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో జూదగాడైన ఓ భర్త డబ్బుకు ఆశపడి భార్య శరీరాన్ని బేరం కుదుర్చుకున్నాడు.

By Medi Samrat  Published on  8 April 2022 8:30 PM IST
జూదంలో ఏకంగా భార్యను పందెంగా పెట్టిన భర్త.. ఆ తర్వాత ఏమి జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో జూదగాడైన ఓ భర్త డబ్బుకు ఆశపడి భార్య శరీరాన్ని బేరం కుదుర్చుకున్నాడు. స్నేహితులతో కలిసి వ్యభిచారంలోకి నెట్టేందుకు ప్రయత్నించాడని భార్య ఆరోపించింది. బదౌన్‌లో మహిళను బందీగా ఉంచారు. మహిళా పోలీసు హెల్ప్‌లైన్ కు సంప్రదించడం ద్వారా ఆమె బయటపడింది. భర్త సహా ఎనిమిది మంది నిందితులపై ఠాణా సుభాష్‌నగర్‌లో కేసు నమోదు చేశారు.

సుభాష్ నగర్‌లోని ఓ కాలనీకి చెందిన మహిళ మాట్లాడుతూ.. తనకు 19 ఏళ్ల క్రితం వివాహమైందని తెలిపింది. పెళ్లయ్యాక ఆమె నగలు, డబ్బును తీసుకుని జూదానికి పాల్పడ్డాడు భర్త. మహిళ మంగళసూత్రాన్ని కూడా విక్రయించాడు. ఆ తర్వాత డబ్బు తీసుకుని స్నేహితులతో జల్సాలను చేయడం ప్రారంభించాడు. ఇక భార్యను వ్యభిచార కూపంలోకి నెట్టలని ప్రయత్నించాడు. ఆ తర్వాత జనవరి 20న బదౌన్‌లోని కున్వార్ గ్రామ ప్రాంతంలో ఓ వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆమెను కున్వార్ గ్రామంలో బందీగా ఉంచారు. దీంతో ఆ మహిళ పోలీసు హెల్ప్‌లైన్‌కు, జిల్లా పరిశీలన అధికారికి సమాచారం అందించింది. దీంతో పోలీసుల బృందం అక్కడికి చేరుకుని ఆమెను రక్షించింది. ఈ విషయమై సుభాష్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంత పోలీసులు చర్యలు తీసుకోలేదు.

అనంతరం ఆ మహిళ ఎస్‌ఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. ఎస్‌ఎస్పీ ఆదేశాల మేరకు సుభాష్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో భర్త సహా ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని మహిళ ఆరోపించింది. ఎన్ని వేధింపులకు గురి చేసినా.. తన పిల్లల కారణంగా మౌనంగా ఉండిపోయానని తెలిపింది. భర్త తనను మరొకరికి విక్రయించాడని తెలుసుకుని తీవ్ర ఆగ్రహానికి లోనయింది. దీంతో ఆమె పోలీసుల వద్దకు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది.













Next Story