ఓమిక్రాన్ విజృంభణ.. పాఠశాలలు మూసివేసిన రాష్ట్రాలు ఇవే
Full list of states where schools are closed due to Omicron. దేశంలో కోవిడ్-19 తాజా కేసులు రోజురోజుకు మరోసారి పెరుగుతున్నాయి. ఈసారి కొత్త ఒమిక్రాన్ వేరియంట్ అలజడి రేగుతోంది.
By అంజి Published on 4 Jan 2022 4:36 PM ISTదేశంలో కోవిడ్-19 తాజా కేసులు రోజురోజుకు మరోసారి పెరుగుతున్నాయి. ఈసారి కొత్త ఒమిక్రాన్ వేరియంట్ అలజడి రేగుతోంది. దేశవ్యాప్తంగా కొత్త కేసుల వేగవంతమైన పెరుగుదల కారణంగా, ఢిల్లీ, ముంబై, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తో సహా అనేక నగరాలు, రాష్ట్రాలు పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని అరికట్టడమే పాఠశాలలను మూసివేయడం వెనుక లక్ష్యం. వైరస్ విజృంభణను గుర్తించి నగరంలోని అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ఢిల్లీ మొదట ప్రకటించింది. ఆ తరువాత హర్యానా కూడా స్కూళ్లు మూసివేస్తున్నామని తెలిపింది.
అయితే ఇప్పటి వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పూర్తి జాబితాను కింద చూడండి.
1. ఢిల్లీ
అథారిటీ నుండి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్ని పాఠశాలలు జనవరి 3, 2022 నుండి మూసివేయబడ్డాయి.
2. హర్యానా
అన్ని పాఠశాలలు, కళాశాలలు జనవరి 12, 2022 వరకు మూసివేయబడతాయి.
3. మహారాష్ట్ర
ముంబైలోని పాఠశాలలు జనవరి 31, 2022 వరకు మూసివేయబడతాయి.
4. తమిళనాడు
తమిళనాడులో, ఇప్పుడు 1 నుండి 8 తరగతులకు జనవరి 10, 2022 వరకు పాఠశాలలు మూసివేయబడ్డాయి.
5. ఒడిశా
పాఠశాలలు మూసివేయబడలేదు, కానీ ప్రైమరీ విద్యార్థులకు తరగతులు ప్రస్తుతానికి వాయిదా వేయబడ్డాయి.
6. పశ్చిమ బెంగాల్
తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడతాయి.
7. రాజస్థాన్
జైపూర్‌లో పాఠశాలలు జనవరి 9, 2022 వరకు మూసివేయబడ్డాయి.
8. బీహార్
చలిగాలుల కారణంగా పాట్నాలోని పాఠశాలలకు జనవరి 8, 2022 వరకు సెలవు ప్రకటించారు.
9. తెలంగాణ
పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల మధ్య, తెలంగాణలో పాఠశాలలు జనవరి 8 నుండి 16 వరకు మూసివేయబడతాయి.
10. జార్ఖండ్
జార్ఖండ్‌లో అన్ని పాఠశాలలు, కళాశాలలు జనవరి 15, 2022 వరకు మూసివేయబడ్డాయి.
11. గోవా
రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు మరియు కళాశాలలు జనవరి 26, 2022 వరకు మూసివేయబడతాయి.
12. పంజాబ్
తాజా లాక్‌డౌన్ మార్గదర్శకాల ప్రకారం పంజాబ్ పాఠశాలలు, కళాశాలలు జనవరి 15, 2022 వరకు మూసివేయబడ్డాయి.
13. ఉత్తర ప్రదేశ్
నోయిడా, ఘజియాబాద్, హాపూర్, గ్రేటర్ నోయిడాలో ఓమిక్రాన్ కేసులు పెరగడం, తీవ్రమైన చలిగాలుల కారణంగా పాఠశాలలు మూసివేయబడ్డాయి. పాఠశాలలు 15 రోజులు, అంటే డిసెంబర్ 31, 2021 నుండి జనవరి 14, 2022 వరకు మూసివేయబడతాయి.