మోదీ సభను టార్గెట్ చేస్తూ దాడులు.. నలుగురికి మ‌ర‌ణ‌శిక్ష‌

Four get death sentence for 2013 Patna serial blasts at Modi’s rally. నరేంద్ర మోదీ లక్ష్యంగా 2013 అక్టోబర్ 27న బీహార్ రాజధాని పాట్నాలో జరిపిన పేలుళ్ల ఘటన

By Medi Samrat  Published on  1 Nov 2021 8:06 PM IST
మోదీ సభను టార్గెట్ చేస్తూ దాడులు.. నలుగురికి మ‌ర‌ణ‌శిక్ష‌

నరేంద్ర మోదీ లక్ష్యంగా 2013 అక్టోబర్ 27న బీహార్ రాజధాని పాట్నాలో జరిపిన పేలుళ్ల ఘటన కేసు విషయంలో కీలక తీర్పును ఇటీవలే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు వెల్లడించింది. తొమ్మిది మందిని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. 2013 నవంబర్ 6 నుంచి కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ.. మొత్తంగా 250 మంది సాక్షులను విచారించింది. అప్పట్లో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోదీ పాట్నాలోని గాంధీ మైదాన్ లో 'హూంకార్' పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బీజేపీ ప్రధాన నేతలు రావడానికి ముందు వేదిక వద్ద దుండగులు బాంబులు పేల్చారు. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా, 80 మంది గాయపడ్డారు.

ఈ ఘ‌ట‌న‌లో నిందుతులైన న‌లుగురికి ఎన్ఐఏ కోర్టు మ‌ర‌ణ‌శిక్ష‌ను విధించింది. 9 మంది దోషుల్లో ఇద్ద‌రికి జీవిత‌కాల శిక్ష‌ను అమ‌లు చేయ‌నున్నారు. మ‌రో ఇద్ద‌రికి 10 ఏళ్ల జైలుశిక్ష ప‌డింది. ఒక‌రికి ఏడేళ్ల శిక్ష‌ను విధించారు. 2013 సీరియ‌ల్ బ్లాస్ట్ కేసులో మొత్తం 10 మందిని ఎన్ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది. గుజ‌రాత్ సీఎం హోదాలో ఎన్నిక‌ల స‌భ‌ను టార్గెట్ చేస్తూ వేదిక వ‌ద్ద పేలుళ్లు జ‌రిగాయి.ఈ కేసులో ఎన్ఐఏ జ‌డ్జి గుర్వింద‌ర్ మెహ‌రోత్రా తీర్పును వెలువ‌రించారు. విచార‌ణ స‌మ‌యంలో కోర్టు 11 మందిపై ఛార్జిషీటు దాఖ‌లు చేసింది. ఇంతియాజ్ అన్సారీ, ముజీబుల్లా, హైద‌ర్ అలీ, ఫిరోజ్ అస్ల‌మ్‌, ఒమ‌ర్ అన్సారీ, ఇఫ్తిక‌ర్‌, అహ్మ‌ద్ హుస్సేన్‌, ఉమ‌ర్ సిద్ధిఖి, అజారుద్దీన్‌లకు శిక్ష‌ల‌ను ఖ‌రారు చేశారు.


Next Story