అంబులెన్స్ బోల్తా.. నలుగురు మృతి

మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అంబులెన్స్ బోల్తా పడడంతో నలుగురు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు

By Medi Samrat  Published on  1 Dec 2024 5:43 PM IST
అంబులెన్స్ బోల్తా.. నలుగురు మృతి


మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అంబులెన్స్ బోల్తా పడడంతో నలుగురు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు. ప్రమాదం తర్వాత ఘటనా స్థలంలో గందరగోళం నెలకొంది. ధుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని జబల్‌పూర్-నాగ్‌పూర్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. అంబులెన్స్‌ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నుంచి బీహార్‌లోని పశ్చిమ చంపారన్‌కు వెళ్తోంది. పాదచారులను ఢీకొట్టిన అనంతరం అంబులెన్స్ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తాపడింది.

SDOP అపూర్వ భలావి మాట్లాడుతూ.. “ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నుండి అనీష్ షా (18) అనే గాయపడిన వ్యక్తిని అంబులెన్స్ బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఉన్న అతని స్వగ్రామానికి తీసుకువెళుతోంది. అంబులెన్స్‌లో ఇద్దరు డ్రైవర్లు, అతని బంధువులు ఆరుగురు ఉన్నారు. మార్గమధ్యంలో అంబులెన్స్ పాదచారి రంగ్‌లాల్ కులస్తేని ఢీకొట్టింది. అనంతరం అదుపు తప్పి పిల్లర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రతిమా షా (35), ప్రిన్స్ షా (4), ముఖేష్ షా (36), సునీల్ షా (40) ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

Next Story