ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత, ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ ఆరోగ్యం ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా క్షీణించడంతో భువనేశ్వర్‌లోని శామ్ అల్టిమేట్ మెడికేర్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు డీహైడ్రేషన్ సమస్య ఉందని డాక్టర్ అలోక్ పాణిగ్రాహి తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది.
ఆసుపత్రిలో చేరిన కొన్ని గంటల తర్వాత నవీన్ పట్నాయక్ ‘నేను ఆరోగ్యంగా ఉన్నాను’ అంటూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆయన సందేశం రాగానే ఆయన మద్దతుదారులు, అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది.
నవీన్ పట్నాయక్ మరోసారి అస్వస్థతకు గురికావడం గమనార్హం. ఆయన భువనేశ్వర్‌లోని సామ్ అల్టిమేట్ మెడికేర్‌లో చేరారు. డాక్టర్ అలోక్ పాణిగ్రాహి ఆయనను చూసుకుంటున్నారు. ఆయనకు డీహైడ్రేషన్ సమస్య ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యాధికారులు మీడియాకు తెలిపారు. నవీన్ పట్నాయక్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు తదితరులు జగన్నాథుడిని ప్రార్థించారు.