ఫ్యాన్‌కు ఉరివేసుకుని మాజీమంత్రి ఆత్మ‌హ‌త్య

Former BJP minister's body found hanging from fan. చత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, బీజేపీ నేత రాజీందర్‌పాల్‌సింగ్ (72) ఆత్మహత్య చేసుకున్నారు.

By Medi Samrat
Published on : 20 Sept 2021 8:51 AM IST

ఫ్యాన్‌కు ఉరివేసుకుని మాజీమంత్రి ఆత్మ‌హ‌త్య

చత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, బీజేపీ నేత రాజీందర్‌ పాల్‌సింగ్ భాటియా (72) ఆత్మహత్య చేసుకున్నారు. క‌రోనా మహమ్మారి బారినపడి కోలుకున్న ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. రాజ్‌నంద్‌గావ్ జిల్లా చురియా పట్టణంలో తన నివాసంలోని సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. రాజీందర్‌పాల్‌సింగ్ రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని ఖుజ్జి అసెంబ్లీ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయమంత్రిగా రాజీందర్‌ పనిచేశారు.

ఇదిలావుంటే.. రాజీందర్‌పాల్‌సింగ్ ఈ ఏడాది మార్చిలో కరోనా బారినపడి చికిత్స అనంతరం కోలుకున్నారు. అయితే.. ఆ తర్వాతి నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రాజీందర్ భార్య కూడా కొన్నేళ్ల క్రితమే చనిపోయింది. ఆయన కుమారుడు జగ్జీత్‌సింగ్ భాటియా రాయ్‌పూర్‌లో ఓ ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. రాజీందర్‌పాల్‌సింగ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారా..? మ‌రే ఇత‌ర కార‌ణంతో ఆయ‌న మ‌ర‌ణించారా తెలియాల్సివుంది. ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించిన‌ పోలీసులు.. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప‌న్తు చేస్తున్నారు.


Next Story