బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్ భాస్కర్ రావు సోమవారం నాడు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరనున్నారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా హాజరుకానున్నారు. కర్నాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు AAP మొదటి అభ్యర్థి భాస్కర్ రావు. బెంగళూరులోని బసవనగుడి స్థానం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. భాస్కర్ రావు ఆప్ పార్టీకి బ్రాహ్మణుల మద్దతు తీసుకుని వస్తారని భావిస్తూ ఉన్నారు. ఆయన బెంగళూరుకు చెందిన వారే కావడంతో ఆప్ కు మంచి అభ్యర్థే దొరికినట్లని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఆప్ లో చేరనున్న ప్రముఖ పోలీసు అధికారిభాస్కర్ రావు బెంగళూరు నగరంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)గా, పోలీస్ కమిషనర్‌గా కూడా పనిచేశారు. భాస్కర్‌రావు రాజీనామాను ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. పంజాబ్-2022 ఎన్నికలలో గొప్ప విజయం అందుకున్న AAP.. తన దృష్టిని ఈ సంవత్సరం జరిగే బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) ఎన్నికలు, 2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ఉంచింది.