ఢిల్లీ పోలీసులపై గ్రూప్ అటాక్ చేసిన విదేశీయులు

Foreign nationals attack Delhi Police station. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఓ పోలీస్ స్టేష‌న్‌పై దాడి చేసిన ఘ‌ట‌న‌లో 53 మంది విదేశీయుల‌ను

By Medi Samrat  Published on  1 Oct 2021 2:20 PM GMT
ఢిల్లీ పోలీసులపై గ్రూప్ అటాక్ చేసిన విదేశీయులు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఓ పోలీస్ స్టేష‌న్‌పై దాడి చేసిన ఘ‌ట‌న‌లో 53 మంది విదేశీయుల‌ను అరెస్టు చేశారు. సెప్టెంబ‌ర్ 27వ తేదీన మోహ‌న్ గార్డెన్ పోలీస్ స్టేష‌న్‌పై నైజీరియ‌న్లు క‌ర్రెలు, రాళ్ల‌తో దాడి చేశారు. విదేశీయులు దాడి చేసిన ఘ‌ట‌న‌లో ముగ్గురు పోలీసులు గాయ‌ప‌డ్డారు. అయితే ఆ స‌మ‌యంలో గుంపును చెద‌ర‌గొట్టేందుకు పోలీసులు గాలిలో కాల్పులు జ‌రిపారు. పోలీస్ స్టేష‌న్ లోప‌లికి వెళ్లిన విదేశీయులు.. తీవ్ర విధ్వ‌సం సృష్టించారు. ఇటీవ‌ల త‌మ గ్రూపున‌కు చెందిన ఓ వ్య‌క్తి మ‌ర‌ణించిన నేప‌థ్యంలో నైజీరియ‌న్లు ఆగ్ర‌హంగా ఉన్నారు. ఆ వ్య‌క్తికి వైద్య ప‌రీక్ష‌లు చేయాల‌ని పోలీసులు భావించారు. దీన్ని నైజీరియ‌న్లు వ్య‌తిరేకించారు.

పోలీసులపై కర్రలు, ఇటుకలతో దాడి చేసినందుకు నైజీరియన్లుగా భావిస్తున్న 53 మంది విదేశీ పౌరులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్‌లోకి గుంపు ప్రవేశించిన వెంటనే ఢిల్లీ పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఓ నైజీరియన్ వ్యక్తి చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తి మరణానికి కారణాన్ని నిర్ధారించడానికి పోలీసులు వైద్య పరీక్షను నిర్వహించాల్సి ఉంది. అయితే, మరణించిన వ్యక్తికి వైద్య పరీక్ష నిర్వహించడానికి నైజీరియన్లు ఒప్పుకోలేదు. మోహన్ గార్డెన్ పోలీస్ స్టేషన్ బయట విదేశీ జాతీయులు గుమిగూడి ప్లాన్ ప్రకారం ఈ దాడి చేశారు.


Next Story
Share it