ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్-దంతెవాడ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఒక సైనికుడు కూడా వీరమరణం పొందాడు. ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. గత రెండు గంటలుగా ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారని, ఒక జవాను వీరమరణం పొందగా, మరో జవాను గాయపడినట్లు సమాచారం.
మావోయిస్టు కమాండర్ పాపారావుకు చెందిన గంగలూరు ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరుగుతోంది. భద్రతా బలగాలు భారీ సంఖ్యలో మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నాయి. ఈ ప్రాంతంలో అడపాదడపా కాల్పులు కొనసాగుతున్నందున మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.