శనివారం పాట్నాలోని రాంపూర్ దియారా ఘాట్‌లో మోటారు పడవలో ఎల్‌పిజి సిలిండర్ పేలుడు సంభవించిన ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు అధికారి తెలిపారు. బోటులో ఉన్నవారు ఆహారం వండుతుండగా.. ఎల్‌పీజీ సిలిండర్ లీక్ కావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మానేర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
"నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. అనేక మందికి గాయాలు అయ్యాయి. స్థానిక పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. బాధితులందరి గుర్తింపును నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు" అని పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. "పేలుడు సంభవించిన తర్వాత మోటారు పడవ మునిగిపోయింది. దానిని ఒడ్డుకు తీసుకురావచ్చు. గాయపడిన వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. వారి పరిస్థితి నిలకడగా ఉంది. పడవపై ఎల్‌పిజి సిలిండర్‌ను తీసుకెళ్లడం చట్టవిరుద్ధం." అని అధికారులు చెప్పుకొచ్చారు.