ఈ చట్టం ఏ వర్గానికి వ్యతిరేకం కాదు : కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు

వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని వీధుల నుంచి పార్లమెంట్ వరకు ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.

By Medi Samrat
Published on : 31 March 2025 2:58 PM IST

ఈ చట్టం ఏ వర్గానికి వ్యతిరేకం కాదు : కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు

వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని వీధుల నుంచి పార్లమెంట్ వరకు ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. కాగా.. ఈ బిల్లుకు కేరళ క్యాథలిక్ బిషప్ కౌన్సిల్ (కెసిబిసి) మద్దతు తెలిపింది, దీనిపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు స్పందించారు. KCBC వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చిన తర్వాత.. ప్రతిపాదిత బిల్లు ఏ సమాజానికి వ్యతిరేకం కాదని రిజిజు అన్నారు. అదే సమయంలో దాని గురించి ప్రచారం చేస్తున్న "హైప్" ను కూడా ఆయ‌న‌ కొట్టిపారేశాడు.

రిజిజు X పోస్ట్‌లో.. ఈ చట్టం ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. ఇది కొందరి మనసులను విషపూరితం చేసేలా ప్రచారం జరుగుతోంది. ఒక మంత్రిగా, మైనారిటీ కమ్యూనిటీ సభ్యుడిగా వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కేరళలోని ఎంపీలందరికీ కేరళ కాథలిక్ బిషప్స్ కౌన్సిల్ (కెసిబిసి) చేసిన అభ్యర్థనను నేను స్వాగతిస్తున్నాను. ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం రాజకీయాల్లో నిమగ్నమై ఉన్నవారి కర్తవ్యమని వాదించారు. దీంతో పాటు కేరళలోని మునంబమ్‌లో వందలాది కుటుంబాలు తమ ఆస్తులను కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటాన్ని ఎత్తిచూపారు. మునంబంలో వందలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని, తమ ఆస్తులు, ఇళ్లను కాపాడుకునేందుకు పరిష్కారాలు వెతుకుతున్నారని రిజిజు చెప్పారు. ప్రతి పౌరుడి హక్కులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కొనసాగుతుందని, వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కేరళ ఎంపీలను కోరారు.

Next Story