ఏనుగుల గుంపుతో ముప్పు పొంచి ఉన్నా కూడా..!

Elephants chase away tourists trying to provoke them to click selfies. తమిళనాడులోని కూనూర్‌లో ఏనుగుల గుంపు సంచరిస్తుండగా, హైవేపై పర్యాటకుల బృందం

By Medi Samrat  Published on  6 April 2022 3:30 PM GMT
ఏనుగుల గుంపుతో ముప్పు పొంచి ఉన్నా కూడా..!

తమిళనాడులోని కూనూర్‌లో ఏనుగుల గుంపు సంచరిస్తుండగా, హైవేపై పర్యాటకుల బృందం వాటితో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించింది.ఏనుగుల మందలు ఆహారం, నీటి కోసం హైవేలను దాటవలసి వస్తుంది. ఆ పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని, రెచ్చగొట్టవద్దని లేదా ఈ మందల దగ్గరికి వెళ్లవద్దని అటవీ అధికారులు నిరంతరం హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా కొందరు రిస్క్ చేస్తూ ఉంటారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో కొంత మంది వ్యక్తులు మందతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఏనుగులు కట్టేరి సమీపంలో రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తూ ఉండగా ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీన్ని అవకాశంగా భావించి ఓ ఇద్దరు యువకులు ఫొటోలు తీసేందుకు ప్రయత్నించగా ఏనుగులు రెచ్చిపోయాయి. ఏనుగులు అక్కడ ఉన్న వారిని భయపెట్టేందుకు వారిపైకి దూసుకెళ్లాయి. చుట్టుపక్కలవారు భయాందోళనలకు గురై ఆ ప్రాంతం నుండి దూరంగా వెళ్లారు. ఏనుగులు అడవిలోకి పోయే వరకూ సైలెంట్ గా అక్కడే ఉన్నారు.










Next Story