ఆ ఒక్క నియోజకవర్గం మినహా తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న ఉప ఎన్నికలు
ఉత్తరప్రదేశ్‌లోని 10 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది.
By Medi Samrat Published on 15 Oct 2024 4:47 PM ISTఉత్తరప్రదేశ్‌లోని 10 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఉత్తరప్రదేశ్‌లోని 9 స్థానాలకు ఉప ఎన్నికల తేదీలను ప్రకటించారు. నవంబర్ 13న ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనుండగా.. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలోని 10 స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉండగా.. అయితే కోర్టులో పిటిషన్ దాఖలు చేసినందున మిల్కీపూర్‌లో ఉప ఎన్నికల తేదీని ప్రకటించలేదు. యూపీతో పాటు పంజాబ్ ఉప ఎన్నికలు, మహారాష్ట్ర-జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా ఈసీ ప్రకటించారు.
తొమ్మిది అసెంబ్లీ స్థానాలైన కర్హాల్ (మెయిన్‌పురి), సిసమావు (కాన్పూర్), కతేహరి (అంబేద్కర్‌నగర్), కుందర్కి (మొరాదాబాద్), ఖైర్ (అలీఘర్), ఘజియాబాద్, ఫుల్పూర్ (ప్రయాగ్‌రాజ్), మజ్వా (మీర్జాపూర్) మరియు మీరాపూర్ ( ముజఫర్‌నగర్) UP లో 9 మంది ఎమ్మెల్యేలు లోక్‌సభ సభ్యులు కాగా.. ఎస్పీ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకి దోషిగా తేలడంతో సిసమావు సీటు ఖాళీ అయింది.
యూపీలోని 10 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లోనే పోటీ చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఈ స్థానాలకు తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను కూడా ఖరారు చేశారు. ఉప ఎన్నికల్లో కొత్త ముఖాలకే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. అయితే ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఈ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో మీరాపూర్ సీటును ఆర్ఎల్డీకి ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. 2022లో కూడా ఇక్కడి నుంచి ఆర్‌ఎల్‌డీ విజయం సాధించింది. అయితే బీజేపీ తన గుర్తుపై తొమ్మిది స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేయనుంది.