టీ కి రూ.5, సమోసా-కచోరీకి రూ.10.. రేట్ల జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించిన వెంటనే అభ్యర్థులు తమ సన్నాహాలను ప్రారంభించారు.
By Medi Samrat Published on 14 Oct 2023 2:55 PM GMTఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించిన వెంటనే అభ్యర్థులు తమ సన్నాహాలను ప్రారంభించారు. తమ సత్తా చాటేందుకు రంగంలోకి దిగనున్నారు. కాగా, భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) 260 అంశాల జాబితాను విడుదల చేసింది. ఇందులో అభ్యర్థులకు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన నిబంధనలను రూపొందించారు. అలాగే వస్తువులపై ఖర్చు నిర్ణయించారు. ఎన్నికల సంఘం నిర్ణయించిన రేట్ల ఆధారంగా మాత్రమే అభ్యర్థులు ఎన్నికల ఖర్చులు చేయవలసి ఉంటుంది.
అభ్యర్థులెవరైనా రూ.40 లక్షలకు మించి ఖర్చు చేసినట్టు తేలితే విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. అభ్యర్థులు ఆహారం, ఎన్నికల ర్యాలీలు, రోడ్‌షోలు, బాణాసంచా వంటి వస్తువులపై వారి ఖర్చులను కూడా ఆడిట్ చేయాలి. జాబితాలో గ్రాఫిక్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్రింటింగ్, ఫోటోలు ఇతర వస్తువులు, సేవలతో సహా అన్ని ఉన్నాయి.
ఎన్నికల సంఘం నిర్ణయించిన ధరల ప్రకారం.. సోన్ పాప్డీ రూ.225, మిల్క్ కేక్ రూ.484, బాదం బర్ఫీ రూ.460, సాదా బర్ఫీ రూ.460, దోడా బర్ఫీ రూ.460, కాజు కట్లీ రూ. 869, గులాబ్ జామూన్ రూ. 435. స్వీట్స్ ధర రూ.470, స్వీట్స్ స్పెషల్ రూ.495, ఫుడ్ ప్యాకెట్లు రూ.40కి మించకూడదు. దీనితో పాటు సమోసా-కచోరీకి రూ.10, టీ రూ.5, పోహా రూ.12, బంగాళదుంప రూ.10, కాఫీ రూ.15, థాలీ రూ.80కి మించకూడదు.
దీంతో పాటు వాటర్ బాటిళ్లతోపాటు మరికొన్ని వస్తువులకు కూడా రూ.5, రూ.10, రూ.20గా రేట్లు నిర్ణయించారు. పబ్లిసిటీ కోసం వాహనాల్లో 24 గంటల పాటు లౌడ్‌స్పీకర్లు ప్లే చేస్తే రూ.2500, ఆటోల్లో సౌండ్ సిస్టమ్‌కు రూ.2వేలు నిర్ణయించారు.