ఉత్తరకాశీలో 3.5 తీవ్రతతో భూకంపం.. భ‌యంతో ఇళ్ల నుంచి ప‌రుగులు తీసిన ప్ర‌జ‌లు

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది.

By Medi Samrat
Published on : 24 Jan 2025 9:46 AM IST

ఉత్తరకాశీలో 3.5 తీవ్రతతో భూకంపం.. భ‌యంతో ఇళ్ల నుంచి ప‌రుగులు తీసిన ప్ర‌జ‌లు

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ సమయంలో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఉదయం 7.42 గంటల ప్రాంతంలో భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని స్థానిక యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

భూకంపం కారణంగా భూమి కంపించడం జిల్లాలో ఇది రెండోసారి అని కూడా చెబుతున్నారు. శుక్రవారం భూకంపం రావడంతో రోజువారీ పనుల్లో నిమగ్నమైన ప్రజలు భ‌యంతో ఇళ్ల నుంచి బయటకు ప‌రుగులు తీశారు.

భూకంపం సమయంలో వరుణావత్ పర్వతం కొండచరియల నుండి రాళ్ళు ప‌డ్డాయి. గ‌తంలో కూడా వరుణవత్ పర్వతం నుండి చాలాసార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. దీంతో పాటు భూకంపం వల్ల జరిగిన నష్టంపై కూడా ఆరా తీస్తున్నారు.

ఈ భూకంపం 1991 నాటి భూకంప చేదు జ్ఞాపకాలను గుర్తు చేసింది. ఆ సమయంలో రిక్టర్ స్కేలుపై 6.6 తీవ్రతతో భూకంపం రాగా.. భారీ నష్టం వాటిల్లింది. 1991 త‌ర్వాత‌ ఇక్కడ చిన్న చిన్న‌ భూకంపాలు సంభవించాయి. ఇప్పటి వరకు 70కి పైగా చిన్న భూకంపాలు సంభవించాయి.

Next Story