హర్యానాలో భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు

Earthquake of 3.8 magnitude hits Haryana, tremors felt in Delhi. కొత్త సంవత్సరం తొలి రోజైన ఆదివారం ఉదయం ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో భూకంపం

By Medi Samrat
Published on : 1 Jan 2023 9:23 AM IST

హర్యానాలో భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు

కొత్త సంవత్సరం తొలి రోజైన ఆదివారం ఉదయం ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. అయితే భూకంపం కార‌ణంగా ఎలాంటి ప్రాణాపాయం, నష్టం జరగ‌లేదు. ఆదివారం ఉదయం ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో ప్రకంపనలతో హర్యానాలోని ఝజ్జర్‌లో 3.8 తీవ్రతతో భూకంపం నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఢిల్లీ, పరిసర ప్రాంతాలను తెల్లవారుజాము 1.19 గంటలకు 3.8 తీవ్రతతో భూకంపం కుదిపేసింది. భూకంప కేంద్రం హర్యానాలోని ఝజ్జర్‌లో భూమికి 5 కి.మీ లోతులో కేంద్రీకృత‌మై ఉందని "నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఒక ప్రకటనలో తెలిపింది.


Next Story