4.3 తీవ్రతతో కార్గిల్‌లో భూకంపం
జమ్మూకశ్మీర్‌లోని కార్గిల్‌లో ఈరోజు ఉదయం 7.22 గంటలకు భూకంపం సంభవించింది.
By Medi Samrat
జమ్మూకశ్మీర్‌లోని కార్గిల్‌లో ఈరోజు ఉదయం 7.22 గంటలకు భూకంపం సంభవించింది. భూకంపం రావడంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. జాతీయ భూకంప కేంద్రం ప్రకారం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.3గా అంచనా వేయబడింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.
Earthquake of magnitude 4.3 hit 346km NNW of Kargil at about 7:22 am: National Center for Seismology (@NCS_Earthquake) pic.twitter.com/Egpv4NsfNs
— Press Trust of India (@PTI_News) May 10, 2024
గత కొద్ది రోజులుగా జమ్మూ కాశ్మీర్‌లో పదే పదే భూమి కంపిస్తుంది. మే 1వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో అర్ధరాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.4గా నమోదైంది. బుధవారం రాత్రి 1:33 గంటలకు భూకంపం సంభవించినట్లు ఎన్‌సీఎస్ తెలిపింది. భూకంపం కారణంగా ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం జరుగలేదని పేర్కొంది. ఏప్రిల్ 19 ఉదయం జమ్మూ కాశ్మీర్‌లోని కార్గిల్, లడఖ్‌లో కూడా భూకంపం సంభవించింది.