గుజరాత్‌లో భూకంపం
గుజరాత్‌లో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలజీ రీసెర్చ్ (ISR) ఈ సమాచారాన్ని ఇచ్చింది.
By Medi Samrat
గుజరాత్‌లో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలజీ రీసెర్చ్ (ISR) ఈ సమాచారాన్ని ఇచ్చింది. కొన్ని గంటల క్రితం ఉత్తర గుజరాత్‌లో 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం దాటికి ప్రజలు వారి ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. స్థానిక యంత్రాంగం ప్రకారం.. ప్రకంపనలు అంత బలంగా లేవు.. ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
గాంధీనగర్‌కు 27 కిలోమీటర్ల దూరంలో గుజరాత్‌లోని బనస్కాంతలో వావ్ భూకంప కేంద్రంగా గుర్తించారు. శనివారం తెల్లవారుజామున 3:35 గంటలకు భూకంపం సంభవించింది. వావ్‌లో భూకంప కేంద్రం భూమికి 4.9 కిలోమీటర్ల దిగువన నమోదైంది.
భూకంపం పరంగా గుజరాత్ అత్యంత సున్నితమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. గత 200 ఏళ్లలో గుజరాత్‌లో 9 భారీ భూకంపాలు సంభవించాయి. జనవరి 26, 2001న, గుజరాత్‌లోని కచ్‌లో ఒక భూకంపం భారీ వినాశనాన్ని కలిగించింది. ఇది గత 200 సంవత్సరాలలో మూడవ అతిపెద్ద భూకంపం. గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (GSDMA) ప్రకారం.. ఈ భూకంపం కారణంగా 13,800 మంది ప్రాణాలు కోల్పోగా, 1.67 లక్షల మంది గాయపడ్డారు.