Earthquake : ఢిల్లీలో మ‌ళ్ళీ భూప్రకంపనలు

Earthquake in Delhi. రాజధాని ఢిల్లీలో బుధవారం సాయంత్రం 4.42 గంటలకు మరోసారి భూకంపం సంభవించింది.

By Medi Samrat  Published on  22 March 2023 1:17 PM GMT
Earthquake : ఢిల్లీలో మ‌ళ్ళీ భూప్రకంపనలు

Earthquake in Delhi

రాజధాని ఢిల్లీలో బుధవారం సాయంత్రం 4.42 గంటలకు మరోసారి భూకంపం సంభవించింది. ఢిల్లీలో వరుసగా రెండో రోజు కూడా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 2.7గా నమోదైంది. ఈరోజు భూకంపం కారణంగా స్వల్ప ప్రకంపనలు సంభ‌వించాయి. మంగళవారం రాత్రి 10.17 నిమిషాలకు బలమైన ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతం మంగళవారం నాటి భూకంపానికి కేంద్రం. ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం తీవ్రత 6.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఫైజాబాద్‌కు ఆగ్నేయంగా 133 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూకుష్ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉంది.

భూకంప కేంద్రం 156 కిలోమీటర్ల లోతులో ఉంది. భారత్‌తో పాటు తుర్క్‌మెనిస్తాన్, కజకిస్థాన్, పాకిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, చైనా, ఆఫ్ఘనిస్థాన్, కిర్గిస్థాన్‌లలో కూడా ప్రకంపనలు సంభవించాయి. భారతదేశంలో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో పాటు, హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో బలమైన ప్రకంపనలు సంభవించాయి. విషయం తెలిసిన వెంటనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. భూకంప భయంతో చాలా మంది ప్రజలు అర్థరాత్రి వరకు ఇళ్ల వెలుపల బహిరంగ ప్రదేశాల్లో ఉన్నారు.


Next Story