ఉత్కంఠ వీడింది. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధిపై నెలకొన్న అపోహలు, ఊహాగానాలు చెల్లచెదురయ్యాయి. ఎన్డీఏ ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధిగా జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును ఎంపికచేస్తూ బీజేపీ కొద్దిసేపటి క్రితం ప్రకటన చేసింది. వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి అభ్యర్ధిగా బరిలో ఉంచనున్నారనే వార్తలకు తెరపడింది. ఈ రోజే ఉమ్మడి ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఎంపికైన విషయం తెలిసిందే.
జూన్ 27న ఉదయం 11.30 గంటలకు సిన్హా నామినేషన్ కూడా దాఖలు చేయనున్నారు. ఇదిలావుంటే.. బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్‌డీఏ) రాష్ట్రపతి ఎన్నికల్లో సంఖ్యా ప్రాతిపదికన బలమైన స్థితిలో ఉంది. దీనికి తోడు ఒడిశాలోని బిజూ జనతాదళ్ లేదా ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ వంటి పార్టీల మద్దతు లభిస్తే ద్రౌపది ముర్ము విజయం ఖాయం.