ఆశించిన స్థాయిలో సమావేశాలు జరగలేదు

Disappointed as Lok Sabha could not function. లోక్‌స‌భ నిర‌వ‌ధిక వాయిదా ప‌డింది. షెడ్యూల్ ప్ర‌కారం ఈనెల 13 వ‌ర‌కు పార్ల‌మెంట్ స‌మావేశాలు

By Medi Samrat  Published on  11 Aug 2021 12:05 PM GMT
ఆశించిన స్థాయిలో సమావేశాలు జరగలేదు

లోక్‌స‌భ నిర‌వ‌ధిక వాయిదా ప‌డింది. షెడ్యూల్ ప్ర‌కారం ఈనెల 13 వ‌ర‌కు పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌ర‌గాల్సివుంది. అయితే.. విప‌క్షాల ఆందోళ‌న నేప‌థ్యంలో నిర‌వ‌ధిక వాయిదా వేశారు. వాయిదా అనంతరం పార్ల‌మెంట్‌ స్పీకర్‌ ఓం బిర్లా మాట్లాడుతూ.. లోక్‌సభ కార్యకలాపాలు ఆశించిన స్థాయిలో జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సభా వ్యవహారాలు ఆశించిన స్థాయిలో జరగకపోవడం తనను బాధించినట్లు చెప్పారు. వీలైనంత వరకు సభా కార్యక్రమాలు జరిగే విధంగా చూసినట్లు తెలిపారు. ప్రజలకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిగినట్లు చెప్పారు.

కానీ విపక్షాలు సభా కార్యక్రమాలను నిత్యం అడ్డుకున్నట్లు ఆయన వెల్లడించారు. గత రెండేళ్ల నుంచి సభలో గరిష్ట స్థాయిలో చర్చలు జరిగినట్లు తెలిపారు. ఈసారి 20 బిల్లులు పాసైనట్లు స్పీకర్‌ బిర్లా చెప్పారు. ఓబీసీ బిల్లుకు అన్ని పార్టీల సభ్యులు సహకరించినట్లు ఆయన వెల్లడించారు. స్వాతంత్య్రానికి 75 ఏళ్లు నిండిన నేపథ్యంలో ప్రగతి సమీక్ష అవసరమని ఆయన తెలిపారు. వర్షాకాల పార్లమెంట్ స‌మావేశాల‌లో భాగంగా జూలై 19న ప్రారంభమైన లోక్‌సభ.. రెండు రోజుల ముందే నిరవధిక వాయిదా పడింది. ఈ సారి 74 గంటల 46 నిమిషాల పాటు లోక్‌సభ జరిగినట్లు స్పీకర్‌ వెల్లడిరచారు.


Next Story