ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు ప్ర‌ధాని నివాసంలో జ‌రిగే ఎన్డీఏ ఎంపీల విందు రద్దు.. కార‌ణం ఇదే..!

సెప్టెంబర్ 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ అధికారిక నివాసంలో ఎన్డీఏ ఎంపీలకు విందు ఏర్పాటు చేశారు

By Medi Samrat
Published on : 7 Sept 2025 9:59 AM IST

ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు ప్ర‌ధాని నివాసంలో జ‌రిగే ఎన్డీఏ ఎంపీల విందు రద్దు.. కార‌ణం ఇదే..!

సెప్టెంబర్ 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ అధికారిక నివాసంలో ఎన్డీఏ ఎంపీలకు విందు ఏర్పాటు చేశారు. అయితే, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు. వాస్తవానికి ఎన్నికలకు ఒక రోజు ముందు అంటే సెప్టెంబర్ 8న విందు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ విందు అనేది ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు ఎన్‌డిఎ నాయకుల సమావేశం అని నమ్ముతారు. అయితే ఇప్పుడు అది క్యాన్సిల్ అయింద‌న‌డం వెనుక కార‌ణం కూడా బ‌య‌టికి వ‌చ్చింది.

ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాలలో ప్రస్తుతం తీవ్రమైన వరదలతో ప్ర‌భావిత‌మ‌య్యాయి. ఈ నేపథ్యంలో ఈ డిన్నర్‌ పార్టీని రద్దు చేశారు. పంజాబ్ ప్రస్తుతం వరదల వల్ల ఎక్కువగా ప్రభావితమైంది. ఈ విపత్తు పరిస్థితుల దృష్ట్యా, డిన్నర్ పార్టీని రద్దు చేశారు.

అదే రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ నేతలకు విందు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇది కూడా రద్దు చేయబడింది. దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాల కారణంగా సంభవించిన భారీ విధ్వంసం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా సంభవించిన నష్టంపై రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఆమె సానుభూతి తెలిపారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో పోస్ట్‌లో రాష్ట్రపతి.. ఈ సంవత్సరం వర్షాకాలంలో ప్రకృతి వైపరీత్యాల గురించి తెలుసుకున్న తర్వాత.. నేను చాలా బాధపడ్డాను. వరదలు భారీ విధ్వంసం సృష్టించాయి, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ మరియు కాశ్మీర్, పంజాబ్, అస్సాం, దేశంలోని అనేక ఇతర ప్రాంతాలలో మరణాలు, ఆస్తి న‌ష్టంతో వ‌ర‌ద‌లు విధ్వంసం సృష్టించాయని పేర్కొన్నారు.

Next Story