ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కౌన్సిలర్ హసీబ్-ఉల్-హసన్ ఆదివారం ఢిల్లీలోని శాస్త్రి పార్క్ మెట్రో స్టేషన్ ముందు ఉన్న హైటెన్షన్ వైర్ టవర్‌పైకి ఎక్కి నిరసన తెలిపాడు. త్వరలో జరగనున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు టిక్కెట్ ఇవ్వలేదని.. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి భవనం ఎక్కారని స్థానికులు తెలిపారు. ఎన్నికలకు 134 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఆప్ విడుదల చేసింది. 134 మంది జాబితాలో 70 మంది మహిళలకు టిక్కెట్లు ఇవ్వగా.. మాజీ ఎమ్మెల్యే విజయేందర్ గార్గ్‌ను ఎమ్‌సిడి ఎన్నికల్లో నరైనా నుండి ఆప్ రంగంలోకి దింపింది.
మరోవైపు కాంగ్రెస్ నుంచి ఆప్‌లోకి వచ్చిన ఢిల్లీలోని అత్యంత సీనియర్ కౌన్సిలర్ ముఖేష్ గోయల్.. ఆదర్శ్ నగర్ వార్డు నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. తిమార్‌పూర్‌లోని మల్కాగంజ్ నుంచి కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ గుడ్డిదేవిని అభ్యర్థిగా నిలిపారు. డిసెంబర్ 4న మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికలు జరగనున్నాయి.