కష్టాల్లో కూరుకుపోయిన‌ కేజ్రీవాల్‌కు మ‌రో ఎదురుదెబ్బ‌

కష్టాలు చుట్టుముట్టిన అరవింద్ కేజ్రీవాల్‌కి ఒకదాని తర్వాత ఒకటి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్

By Medi Samrat  Published on  10 April 2024 12:28 PM GMT
కష్టాల్లో కూరుకుపోయిన‌ కేజ్రీవాల్‌కు మ‌రో ఎదురుదెబ్బ‌

కష్టాలు చుట్టుముట్టిన అరవింద్ కేజ్రీవాల్‌కి ఒకదాని తర్వాత ఒకటి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి పాల్పడిందని.. పార్టీలో దళితులకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని రాజ్‌కుమార్ ఆరోపించారు. అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించిందని.. కానీ నేడు పార్టీ అవినీతి ఊబిలో కూరుకుపోయిందన్నారు. మంత్రిగా ఈ ప్రభుత్వంలో పనిచేయడం నాకు అసౌకర్యంగా మారిందన్నారు.

అవినీతిలో నా పేరు రాకూడదని ఈ పార్టీకి, ప్రభుత్వానికి, మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. రాజ్‌కుమార్ ఆనంద్ ఢిల్లీ ప్ర‌భుత్వంలో సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖను నిర్వహించేవారు. తాజాగా రాజ్‌కుమార్ ఆనంద్ ఇంటిపై ఈడీ దాడులు చేసింది. గతేడాది నవంబర్‌లో కూడా రాజ్‌కుమార్‌ ఆనంద్‌ ఇంటికి ఈడీ బృందం వెళ్లి సోదాలు జ‌రిపింది. ఆయ‌న‌కు సంబంధించిన‌ డజనుకు పైగా వ్య‌క్తుల‌ ఇళ్లపై ఈడీ దాడులు చేసింది.

Next Story