బీజేపీ ఒక సీరియల్ కిల్లర్ అంటూ విరుచుకుపడిన కేజ్రీవాల్

Delhi CM Arvind Kejriwal slams BJP. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై నిప్పులు చెరిగారు.

By Medi Samrat  Published on  26 Aug 2022 9:45 PM IST
బీజేపీ ఒక సీరియల్ కిల్లర్ అంటూ విరుచుకుపడిన కేజ్రీవాల్

ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వాలను వరుసగా హత్య చేస్తున్న సీరియల్ కిల్లర్ బీజేపీ.. తమ ప్రభుత్వాన్ని కూడా కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి లాక్కునేందుకు ప్రయత్నించిందని, తమ ఎమ్మెల్యేలు ఎవరూ వారి బుట్టలో పడలేదని అన్నారు. తన బలాన్ని నిరూపించుకునేందుకు అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని చెప్పారు. తమ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్లలేదనే విషయాన్ని బల పరీక్షలో నిరూపిస్తానని తెలిపారు.

డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఇరికించేందుకు సీబీఐ ఎంతో ప్రయత్నించిందని అన్నారు. ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో పావలాను కూడా పట్టుకోలేకపోయారని కేజ్రీవాల్ విమర్శించారు. ఇది జరిగిన మరుసటి రోజే మనీశ్ ని ఒక బీజేపీ నేత సంప్రదించారని, ఆప్ నుంచి ఎమ్మెల్యేలను తీసుకురావాలని.. సీఎం పదవిని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లను ఇస్తామని ఆఫర్ ఇచ్చారని చెప్పారు. అయితే మనీశ్ ఈ ఆఫర్ ను తిరస్కరించారని అన్నారు. ఇదే విషయమై ప్రాణాలు పోయినా పార్టీ మారే అవకాశమే లేదని మనీశ్ సిసోడియా కూడా చెప్పిన సంగతి తెలిసిందే..!


Next Story